English   

మొదటి సినిమాకే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ కొట్టిన మెగా హీరో

upena
2020-03-08 12:29:38

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ ఉప్పెన అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పని చేసిన శానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ  ఇంకా విడుదల కాకుండానే,  వైష్ణవ్ తేజకు అప్పుడే  రెండో  సినిమా ఓకే అయిందని చెబుతున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే మొదటి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఇతర ప్రోమోలు కూడా మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సినిమా మంచి క్వాలిటీతో తీసినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమాకి ఇప్పటిదాకా 20 కోట్ల దాకా బడ్జెట్ అయినట్లు చెబుతున్నారు. దేవీ ఇచ్చిన మొదటి ఆట ఆడడంతో తొలి పాట హిట్టవడంతో ఈ సినిమాకు ట్రేడ్ వర్గాల నుంచి మంచి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు చెబుతున్నారు. ఏకంగా నైజాం ఏరియా హక్కుల్ని రూ.4 కోట్లకు దిల్ రాజు కొన్నట్లు చెబుతున్నారు. నైజాంలో బిజినెస్ ఆ రేంజ్ లో ఉంటె మిగతా ఏరియాల నుంచి మంచి ఆఫర్లే వస్తాయని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. వైష్ణవ్ తేజ్ తొలి సినిమాకే ఈ స్థాయి బిజినెస్ జరిగడమంటే మామూలు విషయం కాదు. చూద్దాం మరి ఏమవుతుందో  ?

 

More Related Stories