English   

ఉమెన్స్ డేపై రష్మి గౌతమ్ సంచలన వ్యాఖ్యలు..

rasmi
2020-03-08 19:51:48

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమెకు సినిమాలతో పాటు రియాలిటీ షోలు కూడా బాగానే వస్తున్నాయి. దాంతో గుర్తింపు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగానే వచ్చింది. అందుకే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుకుంటూ ఉంటుంది రష్మి గౌతమ్. ఇప్పుడు కూడా ఇలాంటి పని మరోసారి చేసింది. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. సాధారణంగా అందరిలా ఈమె కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబితే అందులో పెద్దగా విశేషం ఉండేది కాదు. కానీ రష్మీ మాత్రం ఏకంగా దేశంపై సెటైర్లు వేసింది. ఎనిమిదేళ్లుగా ఒక మహిళ న్యాయంకోసం పోరాడుతున్న ఈ దేశంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అంటూ ట్వీట్ చేసింది రష్మి గౌతమ్. ట్వీట్ కింద నిర్భయ తల్లి ఆశా దేవి ఫొటోను జత చేసింది జబర్దస్త్ యాంకర్. దాంతో ఈమెపై కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మీకు ఉన్న సామాజిక బాధ్యత అందరికీ ఆదర్శంగా ఉంటుంది అంటూ ఈమెను కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం న్యాయం అనేది వేగంగా దొరకదు.. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది అంతమాత్రాన దేశంపై ద్వేషం పెంచుకోకూడదు అంటూ ఆమెకు పంచులు కూడా వేశారు. మరోవైపు హోలీ పండగపై ఆమె చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. రంగులు వేసుకునేటప్పుడు మూగ జీవాలపై వేయొద్దు.. అవి మనలో వెళ్లి కడుక్కోలేవు అంటూ ఈమె ట్వీట్ చేసింది. దాంతో హిందువుల పండుగలు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి మీకు గుర్తొస్తాయి.. ఈద్ క్రిస్మస్ ఆ సమయంలో ఇలాంటి పోస్టులు మీరు ఎందుకు పెట్టరు అంటూ ఒక నెటిజన్ రష్మి గౌతమ్ పై ఫైర్ అయ్యాడు. దీనికి ఆమె కూడా ముందు నుంచి నువ్వు నన్ను ఫాలో అయి ఉంటే ఇలా మాట్లాడేవాడివి కాదు అంటూ సీరియస్ గా రియాక్ట్ అయింది. మొత్తానికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది జబర్దస్త్ యాంకర్.

More Related Stories