English   

పవన్ కళ్యాణ్ తో మూడోసారి శృతి హాసన్.. కాంబినేషన్ అదుర్స్..

pawan
2020-03-09 06:53:04

కొన్నేళ్లుగా శృతి హాసన్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత రవితేజతో క్రాక్ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మే 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాటమ రాయుడు తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైన శృతి హాసన్ ఇప్పటి నుంచి మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేస్తానని చెబుతోంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాలో నటించబోతోంది ఈ ముద్దుగుమ్మ. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ అతిథి పాత్రలో నటించబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది. తాజాగా విడుదలైన మగువా మగువా పాట కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. మహిళా దినోత్సవం రోజు విడుదలైన ఈ పాటకు మహిళా ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో శృతి హాసన్ చిన్న పాత్రలో నటించబోతోంది.

త్వరలోనే పవన్ కళ్యాణ్ సినిమా సెట్లో అడుగుపెట్టబోతోంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే బయటకు రానుంది. పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లు ఈ పాత్రకోసం తీసుకోవాలి అనుకున్నా ఎందుకో వాళ్ళు కుదరలేదు. అందుకే శృతి హాసన్ ను తీసుకున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇప్పటికే ఇద్దరు గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు మూడోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు పవన్ శృతి హాసన్. మే 15న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నివేదా థామస్, అనన్య, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పింక్ సినిమా రీమేక్ గా వకీల్ సాబ్ వస్తుంది. అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని పవన్ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

 

More Related Stories