English   

ఫ్యాన్స్ కి రచ్చే : నరసింహనాయుడు కాంబినేషన్ రిపీట్

gopal
2020-03-09 07:32:27

బాలయ్య ఎప్పుడు ఎవరికి అవకాశాలు ఇస్తాడో చెప్పలేం. అది ఒక ఫ్లోలో జరిగిపోతుంది. స్టార్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన 'ఆరడుగుల బుల్లెట్' సినిమా కూడా చాలా కాలం విడుదలకు నోచుకోకున్నా ఆ తరువాత సినిమా విడుదలయింది. ప్రస్తుతం ఆయన చేతుల్లో ఏ సినిమా లేదు. ఈ క్రమంలో బాలయ్య పిలిచి మరీ బి.గోపాల్ అవకాశం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. జై సింహా హిట్ ఇచ్చాడని మొన్న రూలర్ సినిమా ఇచ్చి దెబ్బ పడిన బాలయ్య ఇప్పుడు బి గోపాల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. వీరిద్దరి కాంబినేషన్ లో 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి బాలయ్య ఆయనకు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడని సమాచారం. బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్‌లో చిన్ని కృష్ణ రాసిన కథతో ఒక సినిమా రాబోతుందని ప్రచారం మొదలయింది. మే నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. అయితే వీరి ముగ్గురి కాంబినేషన్ లో నరసింహనాయుడు సినిమా కూడా వచ్చింది.  బోయపాటి తరువాత బాలయ్య చేసే సినిమా ఇదే అంటున్నారు. ఈ సినిమాని బాలయ్య సొంత బ్యానర్ ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ మీద తెరకెక్కించవచ్చని సమాచారం.

More Related Stories