English   

నితిన్ పెళ్లి మీద కూడా కరోనా ఎఫెక్ట్

Nithin Marriage.jpg
2020-03-09 09:23:15

హీరో నితిన్ ఎంగేజ్మెంట్ షాలిని అనే అమ్మాయితో కొద్ది క్రితం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాలిని ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని, ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పి రచ్చ రేపారు నితిన్. అయితే నితిన్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు షాలినీ. 1989 సెప్టెంబర్ 27న జన్మించిన షాలిని నితిన్‌ కన్నా షాలిని సుమారు ఆరేళ్ల చిన్న. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమకి దారితీసిందని అంటున్నారు. వీరిద్దరి పెళ్లి ఏప్రిల్ 16 న దుబాయ్ లో జరగాల్సి ఉంది. అక్కడి పలాజో వెర్సెస్‌ దుబాయిని వేదికగా నిర్ణయించారు.

అయితే కరోనా మహమ్మారి ఆ దేశాన్ని వణికిస్తోంది. ఒకరకంగా దుబాయ్ నుండి వచ్చిన వారిని దూరం నుండి చూడడానికే జనాలు భయపడి పోతున్నారు. అందుకే నితిన్‌ కుటుంబ కుటుంబ సభ్యులు వివాహ వేదికను మార్చాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. నిజానికి ఇరు కుటుంబాలు ముందుగా పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేశారు. రిసెప్సన్‌ని మాత్రమే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకున్నారు.

ఇప్పుడు పెళ్లి కూడా ఇక్కడే చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం మీద స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

More Related Stories