English   

యాంకర్ ప్రదీప్ నాకు ఎలాంటి సంబంధం లేదు..

 Actress Gnaneswari
2020-03-09 11:26:18

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది మేల్ యాంకర్స్ లో ప్రదీప్ పేరు ముందుగా చెప్పుకోవాలి. పదేళ్లుగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్ర యాంకర్. మాట్లాడితే ఎప్పుడు బురద జల్లుదామా అని వేచి చూసే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పదేళ్లుగా ఎలాంటి వివాదం లేకుండా తన కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకసారి దొరికాడు. అది తప్ప ఆయన కెరీర్లో మచ్చ అంటూ ఏమీ లేదు. అది కూడా ఆయన సెలబ్రిటీ అవడం వల్ల హైలైట్ అయ్యాడు. 

ఇక ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా కూడా మారాడు ప్రదీప్. ఇదిలా ఉంటే ఈయన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని.. ఆమెను మోసం చేశాడని సునిశిథ్ అనే దర్శకుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దీనిపై అప్పట్లో మీడియా కూడా కాస్త ఎక్కువగానే ఫోకస్ చేసింది. ఆ మధ్య యాంకర్ ప్రదీప్ ప్రధానంగా వచ్చిన పెళ్లి చూపులు షోలో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరి అనే అమ్మాయిని ప్రదీప్ ప్రేమించాడని.. ఆ తర్వాత ఆమెను మోసం చేశాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయంపై యాంకర్ ప్రదీప్ స్పందించలేదు. 

కొంతమంది పబ్లిసిటీ కోసం అలా చేస్తుంటారని అలాంటివి పట్టించుకోనని చెప్పాడు. ఇక ఇదే విషయంపై ఇప్పుడు జ్ఞానేశ్వరి కూడా మాట్లాడింది. తాను ప్రస్తుతం ఒక పెద్ద MNC కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని.. తనకు నటనపై అస్సలు ఆసక్తి లేదని చెప్పింది. తన స్నేహితుడు తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ లో నటిస్తే అక్కడి నుంచి ప్రదీప్ పెళ్లి చూపులు షోలో అవకాశం వచ్చిందని చెప్పింది జ్ఞానేశ్వరి. ఆ తర్వాత మళ్ళీ ప్రదీప్ ను కలవలేదని తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. దాంతో ప్రదీప్ మిస్టర్ పర్ఫెక్ట్ అని మరోసారి తేలింది. ఈయన నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ ఈ సినిమాను విడుదల చేస్తున్నాయి. 

More Related Stories