తెలంగాణా పిల్లగా నిత్య...పీరియాడిక్ మూవీ

కొన్ని కాంబినేషన్స్ వింటే ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తాయి. అలాంటిదే ముచ్చటే ఇది. సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన కె.ఎఫ్.సి. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఈ సినిమాను నిర్మిస్తోంది. 1979లో సాగే పీరియాడిక్ మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది.
1979లో ఆకాశం నుంచి స్కైలాబ్ అనే భారీ ఉల్క పడుతుందని దీంతో అంతా చనిపోతారని.. భూమి అంతం అయిపోతుందనే వార్తలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా అది మనదేశం పైనే పడుతుందనే ప్రచారం అప్పట్లో గట్టిగా జరిగిందిరు. కానీ ప్రచారం జరిగింత ప్రమాదం ఏమీ జరగలేదు. అది చిన్నదే. సముద్రంలో పడిపోయింది. ఆ నేపథ్యంలో ఆ ఉల్క సముద్రంలో పడిపోవడానికి ‘నాసా’ తీసుకున్న చర్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది.
ఈ యేడాదే విడుదల కాబోతోందని చెబుతోన్న ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు విశ్వక్ రూపొందిస్తుండటం విశేషం. ఈ సినిమాలో తెలంగాణా అమ్మాయి పాత్రను నిత్య పోషించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి ఏప్రిల్ నెల నుండి వెళ్లనున్నట్టు చెబుతున్నారు.