English   

నాని అంటే ఎవరికీ లెక్కలేదుగా.. ఏంటిది.. 

Nani
2020-03-09 16:21:46

నాని సినిమా అంటే ఉండే అంచనాలు వేరు. సైలెంట్ గా వచ్చి ఆయన సినిమాలు సంచలనం రేపుతుంటాయి. మ్యాగ్జిమమ్ సక్సెస్ రేట్ ఉన్న హీరో ఈయన. మీడియం రేంజ్ హీరోల్లో నెంబర్ వన్ నానినే. ఈయన సినిమాలు దాదాపు 30 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంటాయి. ఒకవేళ హిట్ అయితే 40 కోట్ల వరకు వసూలు చేస్తుంటాయి. దాంతో నాని సినిమాలకు పోటీ రావాలన్నా కూడా కొందరు ఆలోచిస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. మార్చ్ 25న ఉగాది కానుకగా చాలా సినిమాలు వస్తున్నాయి. అదే రోజు నాని కూడా వస్తున్నాడు. 

ఈయన నటించిన వి సినిమా మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తనకు 25వ సినిమా కావడం విశేషం. తన తొలి చిత్రాన్ని తెరకెక్కించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటితోనే తన 25వ సినిమాను చేస్తున్నాడు నాని. అలాగే ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నాని ఈ సినిమా కోసం పూర్తి స్థాయి విలన్ అయిపోయాడు. దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. 

రాక్షసుడిని పట్టుకునే రక్షకుడిగా సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని మూడు నెలల కిందే అనౌన్స్ చేసాడు నిర్మాత దిల్ రాజు. కానీ ఇప్పుడు కొందరు నిర్మాతలు మాత్రం అదే రోజు తమ సినిమాను తీసుకొస్తున్నారు. ముఖ్యంగా నాని V చిత్రానికి పోటీగా రాజ్ తరుణ్ సినిమా ఒరేయ్ బుజ్జిగా మార్చ్ 25న వస్తుంది. దాంతో పాటు ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా చేసిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా కూడా అదే రోజు విడుదల అవుతుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ విడుదల చేస్తుండటంతో ఆసక్తి పెరిగిపోయింది. నీలినీలి ఆకాశం పాటతో ఈ సినిమా రేంజ్ మారిపోయింది. మొత్తానికి చూడాలిక.. ఉగాది రోజు నానికి ఎవరు ఎంత పోటీ ఇస్తారో..? 

More Related Stories