English   

రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రకాశ్ రాజ్ సపోర్ట్..

Prakash Raj
2020-03-09 16:35:36

రాహుల్ సిప్లిగంజ్ పై జరిగిన గొడవ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనాలు రేపుతుంది. ఆయన తప్పేం లేదని కొందరు సినిమా వాళ్లు బయటికి వచ్చి చెబుతున్నారు. ఇఫ్పటి వరకు పెద్దలు ఎవరూ మాట్లాడలేదు కానీ బిగ్ బాస్ లో రాహుల్ తో ఉన్న వాళ్లు మాత్రం కొందరు స్పందించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ వచ్చి రాహుల్ కు సపోర్ట్ చేసాడు. రాహుల్ సిప్లిగంజ్ కు అన్యాయం జరిగిందంటూ ఆయన మీడియాకు తెలిపాడు. 

ఆ రోజు పబ్ లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీ లేదని ప్రకాశ్ రాజ్ చెబుతున్నాడు. తప్పు ఎవరు చేసినా కూడా శిక్ష పడాల్సిందే అంటున్నాడు ఈయన. ఈ కేసులో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదంటున్నాడు ఈయన. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ను కలవడంలో ఈ కేసుకు ఏమీ సంబంధం లేదని చెప్పాడు ప్రకాశ్ రాజ్. ఈ కేసు కాంప్రమేజ్ కోసం వినయ్ భాస్కర్ ను కలవాల్సిన అవసరం ఏముందంటున్నాడు ప్రకాశ్ రాజ్. అసలు ఆ రోజు రాహుల్ తప్పు చేయలేదు.. అలాంటప్పుడు కాంప్రమేజ్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు ఈయన. 

ఉన్నట్లుండి రాహుల్ గురించి ప్రకాశ్ రాజ్ వకాల్తా పుచ్చుకోవడం ఏంటి.. ఈ ఇద్దరికి ఏంటి సంబంధం అనుకోవచ్చు కానీ ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఆ స్నేహమే ఇప్పుడు అండగా నిలబడింది.

More Related Stories