English   

కెజియఫ్ ముందు తలదించుకున్న సూపర్ స్టార్స్.. 

 KGF
2020-03-09 16:52:03

కన్నడ సినిమాలు అన్నా.. ఇండస్ట్రీ అన్నా పెద్దగా అంచనాలు ఉండేవి కావు. కానీ ఒక్క సినిమా.. ఒక్క హీరో వచ్చి అంతా మార్చేసాడు. అదే కెజియఫ్.. ఆ హీరో యశ్. ఈయన ముందు ఇప్పుడు ప్రభాస్ తో పాటు మిగిలిన స్టార్ హీరోలు కూడా తల దించుకున్నారు. ఆయన్ని ఎదుర్కోకపోవడం ఎవరితరం కావడం లేదు. ప్రభాస్ అంటే ఇప్పుడు ఇండియన్ స్టార్. కానీ ఆయన కంటే తోపు మరో హీరో ఉన్నాడు. అతడే యశ్. ఈయన ఇప్పుడు ఇండియన్ వైడ్ గా దుమ్ము దులిపేస్తున్నాడు. 

యశ్ నటించిన కేజియఫ్ సినిమా సంచలనాలు రేపింది. థియేటర్స్ లో ఈ చిత్రం సృష్టించిన సంచలనాలకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక అమెజాన్ లో కూడా ఈ చిత్రం రప్ఫాడించింది. ఏకంగా ప్రభాస్ సినిమాను సైతం వెనకబడేసింది కేజియఫ్. ఇప్పటి వరకు అమెజాన్ లో అత్యధిక వ్యూస్ అందుకున్న సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ఏకంగా 79 మిలియన్స్ వ్యూస్ అందుకుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఇన్ని వ్యూస్ తీసుకొచ్చిన సినిమా మరొకటి లేదు. 

తెలుగులో సాహో.. కన్నడలో కెజియఫ్.. హిందీలో వార్ అత్యధికంగా చూసారు. అన్నింటా కలిసి కెజియఫ్ అగ్ర స్థానంలో ఉంది. 'సాహో', 'కెజిఎఫ్' సినిమా వ్యూస్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ హద్దులు దాటేసి మరీ నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ మాత్రం ఇంతవరకు తమ సినిమాల విషయంలో ముందు కెజియఫ్ ఉందని తేల్చేసింది. తొలిభాగం ఇంతగా సంచలనాలు సృష్టించడంతో రెండో భాగం మరింత దుమ్ము దులుపుతుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికోసం దాదాపు 30 కోట్ల వరకు రైట్స్ అమ్మేసారు. 

More Related Stories