English   

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడో...

Pawan kalyan
2020-03-09 17:09:35

ప‌వ‌న్ కళ్యాణ్ ఏంటి.. ముఖ్యమంత్రి కావడం ఏంటి.. కల గానీ కంటున్నారా ఏంటి అనుకుంటున్నారా..? ఇఫ్పుడు ఈయన సినిమా హీరో కాబట్టి ఇక్కడ చేయలేనివి అక్కడ చేసి చూపిస్తాడు. ఇఫ్పుడు కూడా ఇదే జరగబోతుందని తెలుస్తుంది. డేరింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ త్వరలోనే పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో పవన్ ముఖ్యమంత్రిగా నటించబోతున్నాడు. ఇఫ్పటికే ఈయన పొలిటికల్ ఇమేజ్ కు సరిపోయే కథ ఒకటి పూరీ సిద్ధం చేసాడని తెలుస్తుంది. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్న పూరీ.. ఆ సినిమా తర్వాత పవన్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. ఆ మధ్య పవన్, పూరీ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేం లేదని.. తను పవన్ ఎప్పటికి స్నేహితులే అని చెప్పాడు పూరీ జగన్నాథ్. అంతేకాదు తనకు మెగా ఫ్యామిలీతో కూడా మంచి సాన్నిహిత్యం ఉందని చెబుతున్నాడు డ్యాషింగ్ డైరెక్టర్. చిరంజీవితో సినిమా రెండు మూడు సార్లు మిస్ అయినా కూడా ఇప్పటికీ ఆయన కోసం ట్రై చేస్తున్నాడు. మరోవైపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేయబోతున్నాడు పూరీ జగన్నాథ్. 

ఇప్పటికే బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు ఈ కాంబినేషన్ లో వచ్చాయి. ఇప్పుడు వర్కవుట్ అయితే మూడోసారి కాంబినేషన్ కుదిరేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు అనేది ఈ సినిమాలో చూపించాలనుకుంటున్నాడు పూరీ. ఇందులో పవన్ ఐడియాలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ఆయన ఇమేజ్ కు సరిపోయేలా పక్కా పొలిటికల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఈ మూడు సినిమాల తర్వాత పూరీ సినిమా ఉండబోతుంది. 

More Related Stories