English   

చిరంజీవి కోసమే ఆ సాంగ్ చేశా...ఇంకెవరికీ చేయను

chiru
2020-03-09 20:13:23

‘ఎవరు’ చిత్రంతో చాలా ఏళ్ల తరువాత సక్సెస్ బాట పట్టింది రెజీనా. ఈ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులను కొట్టేసింది. ఆ సినిమాతో ఆమె మళ్ళీ ఫాంలోకి వచ్చింది. ఇక ఆమె మీద కొన్ని పుకార్లు కూడా మొదలయ్యాయి. త్వరలో తమిళంలో ఓ సినిమాలో నటించనున్నదని అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోందని.. అది కూడా ఐటెం సాంగ్‌లో నర్తించడానికి ఈ బ్యూటి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ని చిరంజీవే ఇటీవల అనౌన్స్ చేసి నాలుక కరుచుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్‌గా త్రిష కన్ఫాం అయినట్టే. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుతున్న ఈ సినిమాలో హీరోయిన్ రెజీనా కస్సాండ్రా ఓ ఐటెం సాంగ్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులు వేసిందనేది ఖాయమని తేలింది. తాజాగా ఈ సాంగ్ గురించి రెజీనా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఐటెం సాంగ్ అని చెప్పింది. చిరంజీవిగారి సినిమా కాబట్టి ఆయన సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంది చేయమనగానే చెసానని చెప్పుకొచ్చింది. అయితే ఇక ఎవరితో కూడా రాబోయే రోజుల్లో కూడా స్పెషల్ సాంగ్ చేయనని చెప్పుకొచ్చింది ఈ భామ.

More Related Stories