English   

తమన్నాకి ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు మొగుడిగా కావాలట

tam
2020-03-09 20:24:15

 టాలీవుడ్ లో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన పంజాబీ మిల్క్ బ్యూటీ తమన్నా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. మంచు మనోజ్ సరసన శ్రీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ భామ ఆ సినిమాతో పెద్దగా బ్రేక్ తెచ్చుకోకున్నా హ్యాపీడేస్ సినిమాతో మాత్రం హిట్ హీరోయిన్ అనిపించుకుంది. అప్పటి నుండి దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన తమన్నా బాహుబలి లాంటి ప్రేస్టేజియస్ మూవీలో నటించినా ఆమెకి పెద్దగా పేరు రాలేదు. అయితే ఆ తర్వాత సరైన సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇక నటనకి గుడ్ బై చెప్తుందేమో అని అనుకున్న సమయంలో ఎఫ్ -2 సక్సెస్ తో మళ్ళీ కొంచెం బిజీ అయ్యింది ఈ భామ. అయితే ఆమధ్య మా అమ్మ‌ మంచి కుర్రాడిని వెతికే ప‌నుల‌లో ఉందని చెప్పి షాకిచ్చింది ఈ బ్యూటీ.ఇప్పుడేమో ఏకంగా తన భర్తగా ఉండాల్సిన అర్హత ఆ ముగ్గురి హీరోలకే ఉందని చెప్పి షాకిచ్చింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒకవేళ మీ అమ్మ స్వయం వరం ఏర్పాటు చేస్తేఎవరు రావాలనుకుంటున్నారు? అసలు మీకు ఎలాంటి భర్త కావాలి? అని అడగగా ఒకవేళ మా అమ్మ గనుక నాకు స్వయం వరం ఏర్పాటు చేస్తే.. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్, ప్రభాస్‌లను పిలుస్తానని చెప్పింది. వీరి ముగ్గురికే నాకు భర్త అయ్యే అర్హత ఉందని చెబుతోంది తమన్నా.  

 

More Related Stories