English   

నగ్నంగా నటించిన ప్రేక్షకులు సినిమా చూడలేదన్న కరీనా కపూర్..

kapoor
2020-03-10 07:10:03

పెళ్లి తర్వాత కెరీర్ కొనసాగించడం కష్టమని అంటారు. కానీ బాలీవుడ్లో కొందరు హీరోయిన్లు మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్లకు స్టార్ ఇమేజ్ ఉంది. అలాంటి హీరోయిన్లలో కరీనా కపూర్ ముందు వరుసలో నిలుస్తుంది. బాలీవుడ్లో లో ఎన్నో సంచలన సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.'చమేలీ', 'హీరోయిన్' లాంటి చిత్రాలలో మోస్ట్ పవర్ఫుల్ రూల్స్ పోషించింది కరీనా కపూర్. ఈమె కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ రెండు సినిమాల్లో చేసిన పాత్రలు చిరస్థాయిగా మిగిలిపోయాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ సినిమా గురించి కరీనా కపూర్ ఎప్పుడు ప్రత్యేకంగా చెబుతూ ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని మరోసారి గుర్తు చేసుకుంది కరీనా. ఈ మధ్యే ఒక షోలో తన టాప్ ఫైవ్ క్యారెక్టర్స్ గురించి చెప్పింది. వాటిలో 'హీరోయిన్' చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ఒకటని చెప్పింది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కరీనా కపూర్ న్యూడ్ సీన్ చేసింది.

అయితే ఎందుకో మరి ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. సినిమాలో కరీనా కపూర్ రెచ్చిపోయి నటించింది. అర్జున్ రాంపాల్తో కలిసి హాట్ హాట్ సన్నివేశాలు కూడా చేసింది. అయితే ఎన్ని చేసినా ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఏమనుకున్నా సరే హీరోయిన్ సినిమాలో నటించినందుకు ఎంతో గర్వపడుతున్నానని చెప్పింది. ఈ సినిమా కోసం తను వందశాతం కష్టపడ్డానని.. క్యారెక్టర్ డిమాండ్ చేసిందని అందులో నగ్నంగా కూడా నటించానని చెప్పింది కరీనా. తన కెరీర్లో ఈ సినిమా కోసం కష్ట పడినట్లు ఏ సినిమా కోసం కష్టపడలేదని చెప్పింది. అయితే ప్రేక్షకులు తనను అలా చూసేందుకు ఇష్టపడలేదని చెప్పింది. బహుశా అందుకే హీరోయిన్ సినిమా ఫ్లాప్ అయిందని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. మధుర్ బండార్కర్ అద్భుతమైన దర్శకుడని.. నటులలోని ప్రతిభను వెలికి తీయడంలో అతను ముందుంటారని ప్రశంసల వర్షం కురిపించింది.

More Related Stories