English   

మ్యాన్ వర్సెస్ వైల్డ్ విత్ సూపర్ స్టార్...రచ్చ మొదలు

rajni
2020-03-10 07:25:00

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ఫ్యాన్స్ కు బహుమతి నందించాడు బేర్‌ గ్రిల్స్. మ్యాన్ వర్సెస్ వైల్ట్ ప్రోగ్రాం కోసం ఆయన చేసిన సాహసాలను చూసేందుకు ఆసక్తిగా ఉన్న అభిమానుల కోసం ప్రోమో రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ నెల 23న డిస్కవరీ ఛానెల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ కార్యక్రమం షూటింగ్ జరిగింది. రిలీజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రోమో వైరల్‌గా మారింది. ఇందులో రజనీకాంత్ ఎంట్రీ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తనదైన స్టైల్‌లో రజనీకాంత్ ఈ ప్రోగ్రాంలో అలరించారు.  స్టయిల్ ను మిస్ కాకుండా చూసుకోవడమే కాదు, బేర్ గ్రిల్స్ విస్మయపడేలా సినిమాకు తీసిపోని అడ్వెంచర్లు చేశారు. బ్లాక్ కలర్ గాగుల్స్ తో వెహికిల్ మీద ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్...కొండలు ఎక్కుతూ, నీటిలో ఈదుతూ.. సాహసాలు చేస్తూ కనిపించారు. ఇది నిజమైన సాహసం.. అంటూ తన ఫీలింగ్‌ చెప్పారు. డిస్కవరీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇక గతంలో జరిగిన ఈ కార్యక్రమం చిత్రీకరణలో రజినీకాంత్ కు గాయాలయ్యాయని వార్తలు కూడా వచ్చాయి. డిస్కవరీ ఛానెల్ విడుదల చేసిన ట్రైలర్ లో రజిని సాహసయాత్రలో భాగంగా కొండలు ఎక్కుతూ, నీటిలో ఈదుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు రజినీకాంత్.

 

More Related Stories