English   

పవన్ క్రిష్ సినిమా కోసం కొత్త హీరోయిన్

pk
2020-03-10 08:22:03

పవర్ స్టార్ ప‌వ‌న్‌ కున్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని అర్ధం అవుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన వ‌కీల్ సాబ్‌ ఫ‌స్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌, మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ చేసిన లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూశాక ప‌వ‌ర్‌ స్టార్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గలేద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ఇక సినిమాలే లేవనుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలు ఒప్పుకుని చేసుకుంటూ పోతున్నారు. మూడు సినిమాల్లో క్రిష్ తో కూడా ఒక సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా అయిపోయింది. ఓ పక్క షూటింగ్ ఫాస్ట్‌గా జరిగిపోతున్నా హీరోయిన్ గురించి మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో కధ ప్రకారం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని అంటున్నారు.

ఇందులో నిజం ఎంత ఉందొ తెలీదు కానీ ఆ ముగ్గురిని ఎంపిక చేయడమే పెద్ద తలనొప్పిగా మారిందట క్రిష్ కి. ఒక హీరోయిన్ రోల్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌ను పెట్టాలని క్రిష్ భావిస్తున్నారట. సినిమా ప్యాన్ ఇండియా అనుకుంటున్నారు కాబట్టి అక్కడి హీరోయిన్ అయితే కొంత మార్కెట్ పెంచుకోవచ్చనేది ఆయన ప్లాన్. అయితే సినిమా కోసం ముందు సోనాక్షి సిన్హాను అనుకున్నారట. కానీ ఆమె ఒప్పుకోక పోవడంతో వాణీ కపూర్, దిశా పటానీ పేర్లు కూడా లైన్ లోకి వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కొత్త బాంబే హీరోయిన్ ని ఫైనల్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ఎంపికయిందని కూడా ప్రచారం జరుగుతోంది. చూడాలి ఇందులో నిజం ఎంత ఉందొ ?

More Related Stories