English   

అమృత ప్రణయ్ సంచలన ప్రేమ కథతో సినిమా...

Amrutha Pranay.jpg
2020-03-10 13:39:06

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య మిర్యాలగూడ ప్రణయ్. పేరు మోసిన వ్యాపారవేత్త మారుతి రావు కూతురు అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కుల దురహంకారంతో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య చేయించారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. మళ్లీ ఏడాదిన్నర తర్వాత ప్రణయ్ అమృత వార్తల్లో నిలిచారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు ఆత్మహత్య చేసుకోవడంతో అమృత పేరు మరోసారి మీడియాలో వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ ఇద్దరి ప్రేమ కథను కొత్త దర్శకుడు శివ నాగు వెండితెరపై చూపించబోతున్నాడు. సీనియర్ నటి అన్నపూర్ణ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. దీనికి అన్నపూర్ణమ్మ గారి మనవడు అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఒకప్పుడు బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత హీరోగా ఎదిగిన బాలాదిత్య ఇందులో ప్రణయ్ పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

ఇందులో ప్రణయ్, అమృత పాత్రలు ఉండబోతున్నాయని.. ఇద్దరి ప్రేమ కథ ఆధారంగా దర్శకుడు శివ కథ సిద్ధం చేశాడని చెప్పాడు హీరో బాలాదిత్య. ఎవరైనా ప్రముఖుల బయోపిక్ లో నటిస్తే వాళ్ల గురించి ముందుగానే కొన్ని విషయాలు తెలుస్తాయని.. కానీ తాను ప్రణయ్ పాత్రలో నటించిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నానని చెబుతున్నాడు బాలాదిత్య. వాస్తవిక సంఘటనలు తీసుకొని దానికి సినిమాటిక్ టచ్ ఇచ్చామని ఆయన చెబుతున్నాడు.

ట్రెండింగ్ లవ్ స్టోరీ కాబట్టి ప్రేక్షకులను అలరిస్తుందని బాలాదిత్య నమ్ముతున్నాడు. మరి ఆయన నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

More Related Stories