English   

అనుష్కతో కటీఫ్ చెప్పిన ప్రభాస్... కారణం అదే...

Prabhas Anushka.jpg
2020-03-10 14:44:17

ప్రభాస్ పేరు వినగానే అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు కలిసి చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి కాబట్టి. దేశవ్యాప్తంగా జోడీపై మంచి క్రేజ్ ఉంది. బాహుబలితో అనుష్క ప్రభాస్ మధ్య నిజంగానే ఏదో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవి ఎక్కడా ఆగడం లేదు. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చిన కూడా ప్రభాస్, అనుష్క మధ్య ఈ వార్తలు రావడం రావడం ఆగడం లేదు. దాంతో దీనిపై స్పందించారు ప్రభాస్. కావాలంటే తనను టార్గెట్ చేయండి కానీ అనుష్కను మాత్రం వదిలేయండి అర్థం మీడియాను అభ్యర్థించాడు ప్రభాస్. తనతో నటించిన కారణంగా అనుష్కకు అలా చెడ్డపేరు రావడం తనకు ఇష్టం లేదు అంటున్నాడు రెబల్ స్టార్. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని.. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అంటున్నాడు ప్రభాస్.

ముఖ్యంగా అనుష్క ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉందని.. ఆమె ఒక ప్రముఖ నటి అనే సంగతి గుర్తుంచుకోవాలని చెబుతున్నాడు ప్రభాస్. ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుష్క 15 ఇయర్స్ వేడుకకు కూడా ప్రభాస్ రావడం లేదు. ఇప్పటివరకు అనుష్కతో నటించిన హీరోలు.. ఆమెతో పనిచేసిిన దర్శకులు.. అవకాశం ఇచ్చిన నిర్మాతలుు అందరూ ఈ వేడుకకు వస్తున్నారు కాానీ ప్రభాస్ మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఇటలీ షూటింగ్ లో ఉన్నాడు. రాధాకృష్ణ కుమార్ సినిమా కోసం మరికొన్ని రోజులు ప్రభాస్ అక్కడే ఉండబోతున్నాడు. ఇలాంటి సమయంలో అనుష్క ఈ వేడుకకు వస్తే లేనిపోని అనుమానాలు వస్తున్నాయని ప్రభాస్ దీనికి రావడం లేదని తెలుస్తోంది. నిజంగా తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని.. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో రాయడం వల్ల తన కంటే ఎక్కువగా అనుష్కకే నష్టం జరుగుతుంది అని పదే పదే చెబుతున్నాడు ఈ హీరో. తన గురించి ఎలాంటి వార్తలు రాసినా కూడా తాను పట్టించుకోనని.. కానీ మన వల్ల ఇతరులు బాధ పడితే మాత్రం చూస్తూ ఊరుకోలేనని అంటున్నాడు ప్రభాస్. ముందు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు.. ఆ తర్వాత అనుష్కతో మీ రిలేషన్ ఏంటి అని ప్రశ్న రిపీట్ అవుతుంది. దాంతో ప్రభాస్ అందరికీ ఒకేసారి ఈ సమాధానం చెప్పాడు.

తన గురించి రాసినప్పుడు ఎప్పుడూ తాను మీడియాను అభ్యర్థించలేదని.. కానీ తనతో పాటు అనుష్కను కూడా వార్తల్లో నిలిచేలా చేయొద్దు అంటున్నాడు ఈయన. మరి ప్రభాస్ రిక్వెస్ట్ ను సోషల్ మీడియా ఎంత వరకు పట్టించుకుంటుందో చూడాలి.

More Related Stories