English   

మెగా మేనల్లుడు మామూలోడు కాదు.. మేనమామను వాడేశాడు..

vaishnav
2020-03-11 02:08:14

అదేం అదృష్టమో తెలియదు కానీ చిరంజీవి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ మాత్రమే ఆ కుటుంబం నుంచి వచ్చి సక్సెస్ కాలేకపోయారు. ఇప్పటికే దాదాపు అరడజను మంది హీరోలు వచ్చి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మెగా కుటుంబం నుంచి సాయి ధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఉప్పెన' సినిమా వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం.. పైగా ఈ చిత్రానికి కథ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ చిత్రంలోని రెండో పాట విడుదలైంది. ధఖ్ ధఖ్ ధఖ్ అంటూ సాగే ఈ పాట అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే విడుదలైన నీ కన్ను నీలిసముద్రం అనే పాట కూడా యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది.  ఇక ఇప్పుడు విడుదలైన కొత్త పాట కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో దర్శక నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. ఇందులో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు వైష్ణవ్ తేజ్. పైగా పాట మధ్యలో వెనకాల మేనమామ చిరంజీవి ఫోటోను కూడా వాడుకున్నాడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు ఈ కుర్ర హీరో. తొలి సినిమానే అయినా కూడా చాలా అనుభవం ఉన్న నటుడిగా చేస్తున్నాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణ. దర్శకుడు సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు సాన 'ఉప్పెన'తో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో కృతి శెట్టి నాయికగా టాలీవుడ్ లో అడుగుపెడుతుంది. శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎప్రిల్ 2న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సినిమా బిజినెస్ కూడా 12 నుంచి 15 కోట్ల మధ్య జరుగుతుందని తెలుస్తోంది కొత్త హీరోకు ఇంతకంటే సంచలనం మరొకటి ఉండదు.

 

More Related Stories