English   

కరోనా కోసం విజయ్ ప్రచారం...చేయండిలా

vijay
2020-03-10 19:17:49

ప్రపంచం వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలో ఇప్పటివరకూ 80 వేల 735 మంది కరోనా వైరస్ బారినపడగా, 3 వేల 120 మంది మృతి చెందారు. అలాగే ఇటలీలో 7వేల 375 మంది కరోనా ప్రభావానికి గురయ్యారు. 366 మంది మృతి చెందారు. చైనా తరువాత కరోనా వైరస్ కారణంగా ఇటలీలోని అత్యధిక మృతుల సంఖ్య నమోదయ్యింది. ఈజిప్టులో కరోనా తొలి మరణం నమోదైంది. ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా భారత్‌లోనూ మెల్లగా పుంజుకుంటోంది. అమెరికానుంచి బెంగళూరుకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. ఇతనితోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్ము , పంజాబ్‌తో పాటు పుణేలో రెండు కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 47కు పెరిగింది. ఇతర దేశాలనుంచి వచ్చే వారి విషయంలో కేంద్రప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇరాన్, ఇటలీ, సౌత్ కొరియా, జపాన్ దేశాల వారికి మార్చి మూడుకు ముందుగా ఇచ్చిన వీసాలు, ఈ-వీసాలన్నింటిని కేంద్రప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సస్పెండ్ చేసింది. కరోనా గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాలకి లెక్క కూడా లేదు. దీంతో కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హీరో విజయ్ దేవరకొండను సంప్రదించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణా ప్రభుత్వ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విజయ్‌‌తో కలిసి ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కరోనా వైరస్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రజలకు వివరించారు విజయ్.  

 

More Related Stories