ధరమ్ తేజ్ సరసన నివేదా

మెగా మేనల్లుడు సాయిధరమ్ దాదాపు అరడజను ఫ్లాపులు అందుకున్నాడు. ఆ తరువాత ఆయన కిషోర్ తిరుమల చిత్రలహరితో మళ్లీ ట్రాక్ పడ్డాడు. అదే జోష్ లో గత ఏడాది డిసెంబర్ లో మారుతి ప్రతిరోజు పండగేతో మరో హిట్ కొట్టి మార్కెట్ లో నిలబడ్డాడు. అయితే ఈసారి ఆయన నటిస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమాతో సుబ్బు అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కాబోతోంది. ఈ సినిమా కంటే ముందే మనోడు మరో సినిమా ఒప్పుకున్నాడు. అది కూడా ప్రస్థానంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దేవా కట్టాతో. ఈ సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వుండబోతోందని అంటున్నారు. సక్సెస్ లేక సైలెంట్ అయిన భగవాన్ పుల్లారావులు ఈ సినిమా నిర్మించనున్నారని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నివేడా పెతురాజ్ ను ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. వీరిద్దరూ గతంలో చిత్రలహరి సినిమాలో నటించారు. కలిసి అయితే నటించారు కానీ ఇద్దరూ జంట మాత్రం కాడు. మరి ఈ సినిమాలో జంటగా నటించనుండడంతో ఆసక్తి నెలకొంది.