English   

రానా కోసం ముగ్గురు భామలు

rana
2020-03-11 07:11:37

చానళ్ళ తరువాత నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయిన తేజ మళ్లీ సీత లాంటి డిజాస్టర్ తో సైలెంట్ అయ్యాడు. అలా సైలెంట్ అయ్యాడని అనుకున్నారో లేదో వెంటనే మొన్న తన పుట్టినరోజునే వరుసగా రెండు సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. `అలిమేలుమంగ వెంకటరమణ` `రాక్షస రాజ్యంలో రావణాసురుడు` అనే రెండు సినిమాలు ఆయన ప్రకటించాడు. అయితే సినిమా టైటిల్స్ ప్రకటించిన ఆయన హీరోలు ఇతర క్యాస్టింగ్ లాంటివి ఏవీ ప్రకటించలేదు. గోపీచంద్ తో అలిమేలు మంగ వెంకట రమణ చిత్రాన్ని...రానాతో రాక్షస రాజ్యం లో రావణాసురుడు చిత్రాలు తెరకెక్కించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే మళ్లీ రానాతో పొలిటికల్ జానర్ టచ్ చేస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది.  గతంలో లానే ఈ సినిమాలో కూడా రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో కధ ప్రకారం ముగ్గురు హీరోయిన్స్ కి స్కోప్ ఉంటుందట. ఇందుకోసం తేజ చాలా మందిని చూస్తున్నాడని అంటున్నారు. హీరోయిన్స్ సహా కొత్త భామలను కూడా చాలా మందిని వెతుకుతున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే వారిని ఫైనలైజ్ చేయవచ్చని అంటున్నారు. ఈ సినిమా మే నెల నుండి సెట్స్ మీదకి వెళ్లనుంది.

 

More Related Stories