"వకీల్ సాబ్" ఆ ఒక్కటి మాత్రమే మిగిలిందట

రాజకీయాలు తప్ప సినిమాలు చేయనన్న పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ చేస్తున్నారు. ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. తాజగా మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్త్రీ గొప్పతనాన్ని చాటేలా ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. అనే పాటను రిలీజ్ చేశారు. ఇక తాజాగా అందుతున్నా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం.. వేసవి కానుకగా మే 15న విడుదల కాబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే పవన్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్లు చెబుతున్నారు. కేవలం పవన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు చెబుతున్నారు. వకీల్‌సాబ్ ఫ్లాష్ బ్యాక్ లో ఆయన సతీమణి పాత్ర కూడా కీలకమే. దీని నిడివి చిన్నదే అయినప్పటికీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పుడీ పాత్ర కోసమే శ్రుతిహాసన్‌ను ఫైనల్ చేసింది సినిమా యూనిట్. త్వరలోనే ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను కూడా షూట్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.
ఈ సినిమా టీజర్ ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.