English   

బన్నీ - కెతికా శర్మ మళ్ళీ త్రివిక్రమ్ దర్శకత్వంలో

Allu Arjun Ketika Sharma.jpg
2020-03-11 10:39:08

ఇప్పటికే దిగ్గజాలు అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ తరహాలో ఒక ఓటీటీ యాప్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అందుబాటులోకి తీసుకువచ్చారన్న సంగతి తెలిసిందే. దీనికి ఆహ(Aha) అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఓటీటీ రంగంలో పోటీ విపరీతంగా ఎక్కువగా ఉండడంతో దీనిని ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు అరవింద్. ముందుగా ఈ యాప్ కోసం దేవరకొండని అనుకున్నాఋ మనోడితో కొన్ని యాడ్స్ చేయడంతో అవేమీ వర్కౌట్ కాలేదు.

ఈ యాప్ ని ఇంకా జనాల్లోకి దించేందుకు అల్లు అర్జున్-త్రివిక్రమ్ లను రంగంలోకి దింపుతున్నారు. ఈ ఓటీటీ కోసం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాడ్‌ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ నటిస్తుండగా అత‌నికి జోడీగా కేతికాశ‌ర్మ న‌టిస్తోందని అంటున్నారు. అవును ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందనుకుంటున్నారా అవును నిజమే పూరి ఆకాష్ హీరోగా న‌టిస్తున్న `రొమాంటిక్‌` చిత్రం ద్వారా కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. గతంలో త్రివిక్రమ్ అల వైకుంటపురంలో సినిమాలోనే ఈమెను హీరోయిన్ గా నటింపచేస్తారని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు కుదరలేదు ఇప్పుడు ఇలా కానిస్తున్నరన్న మాట.

ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌ ఈరోజు నుండే ప్రారంభం కాబోతోంది. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా సెట్‌ కూడా నిర్మించారు. చూడాలి మరి బన్నీ అన్నా గట్టెక్కిస్తాడో లేదో ?

More Related Stories