English   

ప్రకాష్ రాజ్ గురించి సంచలన విషయాలు బయట పెట్టిన రాజా రవీంద్ర

 Raja Ravindra
2020-03-11 11:07:03

ప్రకాష్ రాజ్ అనే పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చేసేది విలన్ పాత్రలే అయినా మనిషిగా మంచోడు అనేది ఇండస్ట్రీ వర్గాలా మాట. అందుకేనేమో కన్నడ వాడయినా బాషా బేధం లేకుండా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బిజీ నటుడిగా ఉన్నాడాయన. ఆయన ఎంత మంచిగా ఉన్నా ఆయన పేరు ఎప్పుడూ వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. 

తాజాగా ఆయన గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక విషయం ప్రచారమ అవుతోంది. ప్రకాష్ రాజ్ గురించి నటుడు, కొందరు నటులకి డేట్స్ చూసే రాజా రవీంద్ర సంచలన విషయాలు బయట పెట్టారు. తాను అప్పులయిపోయిన సమయంలో తనను పిలిచి ఆదుకున్న ఒకే ఒక్క నటుడు ప్రకాష్ రాజ్ అని ఆయన చెప్పుకొచ్చారు. తన కూతురు పెళ్లి సమయంలో తాను చాలా ఇబ్బందులలో ఉన్నానని ఆ సమయంలో ప్రకాష్ రాజ్ నన్ను పిలిచి తనకు ఆర్ధిక సహాయం చేసారని, దాని గురించి ఇప్పటి వరకు మళ్ళీ అడగలేదని ఆయన చెప్పుకొచ్చారు. 

తన వలన ప్రకాష్ రాజ్ కు ఎటువంటి ఉపయోగం లేదని, ఆయన డేట్స్ కూడా తానెప్పుడూ చూడలేదని అన్నారు. కేవలం పరిచయంతోనే  తన కుమార్తె పెళ్లి చేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలిసి ఇంటికి పిలిచి మరీ డబ్బిచ్చారని అన్నారు. అంతేకాక వేరే బాషకు చెందిన ఒక పేరుమోసిన నటుడు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉంటే ప్రకాశ్ రాజే దేవుడిలా కాపాడారని అన్నారు. ఆ నటుడు బాగా కుంగిపోయి, ఇక తనువు చాలించే స్థితిలో ఉన్నారని తెలుసుకుని ప్రకాష్ రాజ్ తనకు ఫోన్ చేశారని అన్నారు. 

నిజంగా అతను ఆ పొజిషన్ లో ఉన్నాడా? ఉంటే కనుక తన దగ్గరికి తీసుకురమ్మని అడిగారని వెంటనే ఆ నటుడ్ని తీసుకుని ప్రకాశ్ రాజ్ వద్దకు తీసుకెళ్లానని అన్నారు. మొత్తం ఎంత అప్పు ఉంటుందని అడిగి 50 లక్షలు ఉంటాయని తెలిసి వెంటనే ఆ డబ్బిచ్చి అప్పులన్నీ తీర్చేశాడని చెప్పుకొచ్చారు. ఈరోజులలో అలాంటి వ్యక్తులు ఎక్కడో ఒకరుంటారని ఆయన చెప్పుకొచ్చాడు.

More Related Stories