English   

ప్రభాస్ సరసన కత్రినా కైఫ్

Katrina Kaif
2020-03-11 18:25:43

ప్రస్తుతం జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ సినిమా తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్నారు. సై ఫై కధతో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. దాదాపు 400కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కరు స్టార్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం హీరోయిన్‌ గా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ ను ఎంపిక చేశారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

కత్రినా కైఫ్ తెలుగులో మొదటసారిగా వెంకటేష్ సరసన 'మల్లీశ్వరీ' సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బానే అలరించినా ఆ తర్వాత బాలయ్య సరసన చేసిన అల్లరి పిడుగు బోల్తాకొట్టింది. దీంతో పూర్తిగా బాలీవుడ్‌ మీదనే కాన్సంట్రేట్ చేసి స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తోంది. అయితే ఈ ఆఫర్‌కు కత్రీనా సరే అంటుందా.. లేదా అనేది చూడాలి. ఎందుకంటే సౌత్ సినిమాలు అంటే ఈ ముంబై భామలకి కాస్త చిన్నచూపే.

More Related Stories