English   

రౌడీ సినిమాకి టైటిల్ కష్టాలు

Vijay Deverakonda
2020-03-11 18:38:09

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇప్పుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ ఫైటర్ గా నటించనున్నాడు. హిట్ కొట్టి ఫాంలో ఉన్న పూరీ జగన్నాద్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో తొలి సారి పని చేస్తుండడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. పూరీ జగన్నాధ్ సొంత నిర్మాణ సంస్థతో పాటుగా కరణ్ జోహార్ కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మార్షల్ ఫైట్స్ ఫైటర్ గా నటించనున్న విజయ్ దాని కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. అయితే ఈ సినిమాకి టైటిల్ గా ఫైటర్ అనే పేరు ఫిక్స్ చేసినట్టుగా ముందు నుండే ప్రచారం జరిగింది. కానీ తాజాగా లైగర్ అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. ఇది ఎవరికీ కనెక్ట్ అయ్యేలా లేదని  అందుకే ఆ టైటిల్ కాకుండా మరో మంచి టైటిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.   

More Related Stories