ఆచార్య లో పవన్ పాత్ర...టెన్షన్ లో కొరటాల

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు అందించిన కొరటాల శివ అలాంటి స్టార్ డైరెక్టర్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వల్ల ఇబ్బందుల్లో పడ్డారని ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్న తాజా చర్చ. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమాకు తొలుత పవన్ కల్యాణ్ హీరోగా అనుకున్నారట కొరటాల. ఇందులో డ్యూయెల్ రోల్స్‌ను పవన్‌తోనే చేయిద్దామని భావించారట. ఇదంతా అజ్ఞాత వాసి అప్పటి సంగతి అయితే అంతా రెడీ అయ్యాక సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ కావడంతో ఆ సినిమాను పవన్ వదులుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో పవన్ డైరెక్టర్ కొరటాలకు ఒక సలహా కూడా ఇచ్చారట. ఆ సలహా ప్రకారం చిరంజీవి హీరోగా సినిమా మొదలుపెట్టారు కొరటాల. అయితే డ్యూయల్ రోల్ కాకుండా ఈ సినిమాలోని కీలకమైన యంగ్ క్యారెక్టర్లో రాంచరణ్‌ను తీసుకుందామని భావించారట. చరణ్ కు తగ్గట్టుగానే క్యారెక్టరైజేషన్ సిద్ధం చేసుకున్నారట. కానీ చరణ్ ఏమో ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్నారు. ఆ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో తెలియాదు. అది పూర్తయితేగానీ ఆచార్య సినిమాలో రాంచరణ్ చేసే పరిస్థితి లేదు. ఇంతలో రాంచరణ్‌కు బదులు ఆచార్య సినిమాలో ప్రిన్స్ మహేష్‌బాబును తీసుకుంటారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ మహేష్‌బాబును తీసుకునే ఉద్దేశం ఉంటే.. ఆయనకు తగ్గట్టుగా స్క్రిప్ట్ మార్చాల్సి ఉంటుంది. ఇంకో పక్క దసరా కంటే ముందే సినిమా రిలీజ్ చెయ్యాలని చిరంజీవి ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్న్నారు. దీంతో ఏమి చేయాలో అర్ధం కాక కొరటాల తలపట్టుకున్తున్నట్టు చెబుతున్నారు.