English   

వరుణ్ సినిమా కోసం ఉప్పి

varuntej
2020-03-12 07:15:03

మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా బాక్సింగ్ నేపథ్యంలో  ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. కిరణ్ కొర్రపాటి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విలన్ గా నవీన్ చంద్రను ఎంపిక చేసినట్టు కూడా తాజాగా ప్రచారం మొదలయింది. ఆ విషయం మీద క్లారిటీ రాకున్నా ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర కీలక పాత్ర పోషించనున్నట్లు మరో కొత్త ప్రచారం మొదలయింది. ప్రస్తుతం ఆయనతో ఈ సినిమా మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ వైజాగ్ లో జరుపుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ లో మొదలవుతుందని సమాచారం. అంతే కాదు ఈ సినిమాలో వరుణ్ తేజ తల్లిగా నదియా నటించబోతోందట. అయితే నిజానికి సినిమా సెట్స్ మీదకు వెళ్ళక ముందు ఆ పాత్రకోసం రమ్యకృష్ణను సంప్రదించారు నిర్మాతలు. అయితే రీజన్ ఏమిటో తెలియదు కానీ ఆమె పాత్ర ఇప్పుడు నదియాకి వెళ్లినట్టు చెబుతున్నారు. అల్లు వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.  

 

More Related Stories