English   

సాయిధరమ్ తేజ్ భలే అందుకున్నాడే

sai
2020-03-12 07:58:03

వరుస పరాజయాలు ఎదుర్కొన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు చిత్రలహరితో ఒక హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో చేసిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కూడా హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆయన సోలో బతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ధరమ్ తేజ్ కు జోడీగా నభా నటేశ్ నటిస్తుండగా, బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు సుబ్బు నిక్కీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర్ అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా విడుదలకి ముందే నిర్మాతలు సేఫ్ అయిపోయారని అంటున్నారు. నిజానికి వరసగా ఆరు ప్లాపులు తిన్నాడు. ఆ దెబ్బకి మార్కెట్ అంతా పోయింది. అల్లు అర్జున్ తరువాత ఆకాంపౌండ్  సత్తా చాటుతాడు అనుకుంటే మనోడేమో ఉనికిని చాటుకునే స్థితికి చేరుకున్నాడు. అయితే రెండు హిట్స్ కొట్టడంతో మళ్ళీ దారిలో పడ్డాడు. సోలో సినిమాకి ఇటీవలే నాన్ థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత క్లోజ్ చేసినట్లు తెలిసింది. దాదాపు 10 కోట్ల పైగా రేటు పలికిందిట. అయితే సినిమా బడ్జెట్ 20 కోట్ల లోపే ఉండడం వలన రిలీజ్ సమయానికి నిర్మాత టేబుల్ ప్రాఫిట్స్ అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఇక కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ కే అంత పలికితే సినిమా ఇంకెంత లాభం తెస్తుందో చూడాలి.

 

More Related Stories