అల్లుడు శీను అదుర్స్ అనిపిస్తున్నాడు...

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీలో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా ప్రోవ్వ్ చేసుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తన మొదటి సినిమా నుండి శ్రీనివాస్ విక్రమార్క ప్రయత్నం చేయగా గత ఏడాది ‘రాక్షసుడు’తో హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ‘కందిరీగ’, ‘రభస’, వంటి సినిమాలను కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతేడాది చివరలో మొదలయిన ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈరోజే ఆ సినిమా టైటిల్ ప్రకటించారు. బెల్లం బాబు మొదటి సినిమా పేరు కలిసేలా అల్లుడు అదుర్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇక ఇది బెల్లంకొండకి పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త లుక్‌లో కపించబోతున్నారు. అందుకోసం బెల్లంకొండ శ్రీనివాస్ 8 ప్యాక్స్ తో రెడీ అయ్యాడు. నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాని సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రహ్మణ్యంనిర్మించనున్నారు. ‘సింగం’, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘అల్లుడు శీను’, ‘జయ జానకి నాయక’ చిత్రాల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో సినిమా ఇది.