English   

ఎక్కడ ఆపాడో.. అక్కడే మొదలుపెట్టిన మణిశర్మ..

Mani Sharma
2020-03-12 11:50:25

ఆరేళ్ల కింద ఎక్కడ మణిశర్మ కెరీర్ కు బ్రేక్ లు పడ్డాయో.. ఇప్పుడు మళ్లీ అక్కడే స్పీడ్ అందుకుంటున్నాడు సీనియర్ సంగీత దర్శకుడు. ఒకప్పుడు ఈయన లేని సినిమా లేదు. ఏ సినిమా పోస్టర్స్ చూసినా మణిశర్మ పేరు కనిపించేది. కానీ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు పూర్తిగా సైలెంట్ అయిపోయాడు మణిశర్మ. ఇప్పుడు మళ్ళీ ఈయన దూకుడు మొదలైంది.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి రచ్చ చేస్తున్నాడు మెలోడి బ్ర‌హ్మ‌. అయినా మెలోడి బ్రహ్మ అని తెలుగులో ఈ పేరు ఒక్క మ‌ణిశ‌ర్మ‌కు త‌ప్ప మ‌రే సంగీత ద‌ర్శ‌కుడికి స‌రిపోదు. ఆయ‌న మాత్ర‌మే దీనికి అర్హుడు. 

ఇప్పుడు కాదు.. ఎప్ప‌టికైనా మ‌ణిశ‌ర్మ పాట‌లంటే ఆల్ టైమ్ ఫేవ‌రేట్ అంతే. కాక‌పోతే ఇండ‌స్ట్రీలో ఎవ‌రికైనా ఓ టైమ్ వ‌ర‌కే అన్నీ న‌డుస్తాయి. మ‌ణిశ‌ర్మ టైమ్ ఇప్పుడు లేదు. అందుకే కుర్రాళ్ల‌కు వ‌దిలేసి తను హాయిగా కొన్ని సినిమాల‌కు ఆర్ఆర్ ఇస్తున్నాడు. ఒక‌ప్పుడు ఈయ‌న ప‌నిచేయ‌ని హీరో లేడు.. ద‌ర్శ‌కుడు లేడు. అప్ప‌ట్లో ఏ సినిమా చూసినా ఈయ‌న పేరు క‌న‌బ‌డాల్సిందే. ప‌దేళ్ల కాలంలోనే 110కి పైగా సినిమాలకు సంగీతం అందించాడు మ‌ణిశ‌ర్మ‌. ఈ మ‌ధ్య దేవీ, థ‌మ‌న్ కు తోడు కుర్ర సంగీత ద‌ర్శ‌కుల తాకిడి.. స్టార్ హీరోలు వీళ్ళ‌కు ప‌డిపోవ‌డంతో మ‌ణిశ‌ర్మ కాస్త సైలెంట్ అయిపోయాడు. ఆ మధ్య నితిన్ లై సినిమాతో పాటు మ‌రిన్ని సినిమాల‌కు ప‌ని చేసాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. 

2018లో కూడా వ‌ర‌స‌గా సినిమాలు చేసాడు మ‌ణిశ‌ర్మ‌. ఎమ్మెల్యే సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలకు సంగీతం అందించాడు. ఇక ఈ ఏడాది విడుద‌లైన ఇస్మార్ట్ శంకర్ పాటలు మణిశర్మ లోని అసలైన మాస్ సంగీత దర్శకుడిని మళ్లీ బయటికి తీసుకొచ్చాయి. ఇక గ‌త రెండేళ్లుగా జెంటిల్ మ‌న్.. లై.. ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు మణి. ఈ మ‌ధ్యే ఈయ‌న చేతుల్లోకి భారీ ప్రాజెక్ట్ ఒక‌టి వ‌చ్చింది. అదే చిరంజీవి కొరటాల సినిమా. 

గతంలో చిరంజీవికి చాలా మ్యూజికల్ హిట్లు ఇచ్చాడు మణిశర్మ. అదే నమ్మకంతో ఇప్పుడు మరో అవకాశం ఇవ్వబోతున్నాడు మెగాస్టార్. ఈ సినిమాతో పాటు రామ్ రెడ్.. వెంకటేష్ అసురన్ రీమేక్ సినిమాలకు కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు మణిశర్మ. ఇక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ తో దేవా కట్ట చేయబోయే సినిమాకు కూడా మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. మొత్తానికి మణిశర్మ దూకుడు చూసి దేవి శ్రీ ప్రసాద్, తమన్ ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు.

More Related Stories