English   

హాలీవుడ్ దంపతులకు కరోనా వైరస్..

Tom Hanks
2020-03-12 12:08:01

కరోనా వైరస్ మహమ్మారి ఎవరిని వదలడం లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇంటి నుంచి కాలు తీసి బయట పెడదాం అంటే కరోనా వైరస్ లేకుండా తిరిగి వస్తావా లేదా అనే అనుమానం అందరిలోనూ వచ్చేసింది అంటే ఈ వైరస్ ఈ రేంజిలో వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని దేశాలు ఇప్పుడు కరోనా వైరస్ ను అరికట్టడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. 

తాజాగా హాలీవుడ్ దంపతులు టామ్ హంక్స్, అతని భార్య రీటా విల్సన్‌కు వైరస్ సోకింది. అస్వస్థతతో ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ షాక్‌నకు గురైంది. ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాలో సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో ఇబ్బంది పడ్డారు. సాధారణంగా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చారు. అయితే వారు చెప్పే లక్షణాలు కరోనా వైరస్ మాదిరిగా ఉండటంతో.. వైద్యులు ఆ పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ తేలడంతో టామ్ హంక్స్ దంపతులు నోరెళ్లబెట్టారు.

 ఇదే విషయాన్ని టామ్ హంక్స్ ట్వీట్ చేశారు. వెంటనే వైద్యులు అప్రమత్తమై వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే వాళ్ల నుంచి ఎవరెవరికి కరోనా వైరస్ సోకింది అనేది మాత్రం ప్రస్తుతం అనుమానంగా మారింది. షూటింగ్ సమయంలో చాలా మంది క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. అలాంటి సమయంలో మిగిలిన వాళ్లకు కూడా ఈ వైరస్ సోకుతుంది. అయితే ఈ దంపతులు ఎవరితో దగ్గరగా ఉన్నారు.. వీళ్ళ నుంచి ఇతరులకు సోకిందా లేదా అనే అంశంపై అధికారులు ఇప్పుడు దృష్టి పెట్టారు. 

మరోవైపు కరోనా వైరస్ ప్రబలడంతో తన షోను వాయిదా వేసుకున్నానని ప్రముఖ గాయనీ సీలైన్ డియాన్ ప్రకటించింది. ఆమె జలుబుతో బాధ పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను ఇప్పటికే వైద్య పరీక్షలు చేసుకున్నానని.. అందులో కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఎందుకైనా మంచిది.. ప్రజలతో దగ్గరగా ఉండకుంటే బెటర్ అని షో ని వాయిదా వేసుకున్నానని వివరించారు. టామ్ దంపతులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్లో సూచించారు. ఏ మాత్రం కరోనా వైరస్ లక్షణాలు కనిపించినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు ట్వీట్ చేశారు.

More Related Stories