English   

సీఎం పదవిపై నాకు మోజు లేదు.. రజినీకాంత్ క్లారిటీ..

Rajinikanth
2020-03-12 12:26:55

ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజనీకాంత్ చాలా రోజుల తర్వాత రాజకీయ సమావేశం ఏర్పాటు చేశాడు. అందులో చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చాడు సూపర్ స్టార్. ప్రజలతో పాటు పార్టీ నాయకులలో కూడా ఉన్న చాలా అనుమానాలను నివృత్తి చేసాడు రజినీకాంత్. వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదని ఈయన చెబుతున్నాడు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజినీకాంత్ చాలా విషయాలపై మాట్లాడాడు. 

ఈ సందర్భంగా రాష్ట్ర దేశ రాజకీయాల గురించి ప్రస్తావించారు. తను రాజకీయాల్లోకి వచ్చింది రాష్ట్ర అభివృద్ధి చేయడానికి తప్ప.. సీఎం పదవి కోసం కాదు అని.. ముఖ్యమంత్రి పదవి కోసం ఎప్పుడూ ఆరాట పడలేదు అని చెప్పడమే కాదు.. తనకు అవసరం కూడా లేదని చెప్పాడు సూపర్ స్టార్. 45 సంవత్సరాలుగా తాను సినిమాలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావితం చేస్తుందని అన్నారు. తన పార్టీలో 60 నుంచి 65 శాతం యువకులకే అవకాశం ఇస్తానని చెప్పారు. అంతేకాదు ఒక చదువుకున్న యువకున్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తానని సంచలన ప్రకటన చేశారు రజనీకాంత్. 

ప్రస్తుత శాసనసభ్యులందరూ 50 ఏళ్లు పైబడిన వారు.. రాజకీయాల్లోకి యువతకు అవకాశం ఇవ్వాలి అనేది తన లక్ష్యం అంటున్నారు రజిని. అందుకే తన పార్టీలో 60 నుండి 65 శాతం సీట్లు 50 ఏళ్లలోపు వారికి ఇవ్వబడుతుంది.  మిగిలిన 30 నుండి 35% పార్టీ నుండి వైదొలగడానికి అవకాశం లేని వారికి ఇవ్వబడుతుంది అనే క్లారిటీ ఇచ్చాడు రజనీకాంత్. తనతో సహా రిటైర్డ్ న్యాయమూర్తులను నేరుగా వారి ఇళ్లకు వెళ్లి రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానిస్తామని చెప్పాడు సూపర్ స్టార్. తాను పార్టీ నాయకుడిగా ఉంటాను కానీ నాయకత్వం వహించడానికి మంచి యువకుడిని ఎన్నుకుంటానని తెలిపాడు రజనీకాంత్. ఒక చదువుకున్న యువకున్ని సీఎం అభ్యర్తిగా ప్రకటిస్తానని హీరో రజినీకాంత్ తెలిపాడు. 

జయలలిత మరణం తర్వాత తనను నమ్ముకున్న ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పానని రజినీకాంత్ క్లారిటీ ఇచ్చాడు. డిఎంకె, ఎఐఎడిఎంకెలకు 50 వేలకు పైగా పార్టీ పదవులు ఉన్నాయని..  దీనికి ఎన్నికల సమయం మాత్రమే అవసరమని ఎద్దేవా చేశాడు రజినీకాంత్. అవినీతి లేని రాజకీయాలు అందించాలని తాను పార్టీ పెట్టినట్లు ప్రకటించారు రజనీకాంత్. తన పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి అనేది లేకుండా చేస్తామని హామీ ఇచ్చాడు. ఖచ్చితంగా వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుందని చెప్పాడు సూపర్ స్టార్. ఏదేమైనా చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి రజినీకాంత్ మాట్లాడటంతో తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.

More Related Stories