English   

కరోనా దెబ్బ : నెల్లూరులో థియేటర్స్ బంద్

corona
2020-03-12 19:20:59

కరోనా వైరస్ ఏపీలో కలకలం రేపుతోంది..నెల్లూరు ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సా అందిస్తున్నారు. ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు కోవిడ్ వచ్చిందనే ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో మరోసారి వారి నామునాలను పుణేకు పంపించారు. దీంతో చర్యలు ప్రారంభించిన అధికారులు...నెల్లూరు నగర వ్యాప్తంగా అలర్ట్ చేశారు...అంతేకాదు ఆ ఇద్దరు యువకులు ఎవరెవరిని కలుసుకున్నారు...వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు లో కోవిడ్-19 ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. ప్రభుత్వ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు చేపట్టవలసిన చర్యలను వివరించారు. ఇటలీ నుంచి వచ్చిన వారెవరైన 21 రోజులు ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిస్తే..వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు. అంతేకాక నెల్లూరులో కరోనా వైరస్ అనుమానిత కేసు నమోదు కావడంతో  ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో వారికి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు లో కోవిడ్-19 ప్రభావంతో అన్ని థియేటర్స్ ని ఇప్పటికిప్పుడు మూసేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు. మరలా ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది ఇంకా పేర్కొనలేదు.

 

More Related Stories