English   

ఏకంగా బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన టాలీవుడ్ డైరెక్టర్

Hanu Raghavapudi
2020-03-13 11:31:16

టాలీవుడ్ అనే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కొందరు దర్శకులు చేసిన సినిమాలు ఆల్ టైం ఫేవరెట్స్ గా ఉంటాయి. ఆ సినిమాలను ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు. అలాంటి దర్శకుడికి ఒక్క ఫ్లాప్ పడగానే ఆ దర్శకుడిని ఈజీగా మర్చిపోతుంటారు మన నిర్మాతలు. అలాంటి దర్శకులలో ఒకరే హను రాఘవపూడి. ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. కమర్షియల్ గా ఈ సినిమా ఆడకున్నా మంచి సినిమా అనే పేరు రావడంతో మరో సినిమా సంపాదించాడు. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇక నాని, మెహ్రిన్ జంటగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నా ఆ తర్వాత మళ్ళీ శర్వానంద్ తో పడి పడి లేచే మనసు పెద్ద దెబ్బ వేసింది. దీంతో ఆయన తెలుగులో మరే సినిమా చేయలేని పరిస్థితి.

తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్‌ తెలుగులో రీమేక్ రీమేక్ చేయబోతున్నరనగానే ఈ ప్రాజెక్టును దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తారనే టాక్ టాలీవుడ్‌లో నడిచింది. అయితే అది ప్రచారానికే పరిమితం అయిపొయింది. అయితే ఈయనకు ఇప్పుడు బంపర్ ఆఫర్ ఒకటి తగిలినట్టు చెబుతున్నారు. ఆయనకు ఏకంగా బాలీవుడ్ నుండి పిలుపు వచ్చిందని సమాచారం. నిజానికి మన తెలుగు డైరెక్టర్ లలో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ సినిమాలను అందులో స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. 

ఇప్పుడు తాజాగా  ఈయన కూడా అలాంటి ఛాన్స్ కొట్టేశాడని అంటున్నారు. అదేంటంటే అనీల్ శర్మ, సన్నిడియోల్ కాంబినేషన్ లో గతంలో గదర్ ఏక్ ప్రేమ కథ చిత్రం వచ్చి సూపర్ హిట్టైంది. 2001లో వచ్చిన ఈ చిత్రం సన్నిడియోల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ అయినట్టు చెబుతున్నారు. అయితే ఈసారి యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేసి తెరకెక్కించనున్నట్టు బీటౌన్ నుండి అందుతున్న సమాచారం. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతున్నట్టు చెబుతున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడే దాకా నమ్మలేము కూడా ఎందుకంటే అది బీ టౌన్ కదా.

More Related Stories