English   

మెగాఫోన్ పట్టిన మరో కొరియోగ్రాఫర్

Brinda master
2020-03-13 11:45:59

కొరియోగ్రాఫర్ లు దర్శకులుగా మారడం మనకేమీ కొత్త కాదు. లారెన్స్ లాంటి వారు ముందుగా కొరియోగ్రాఫర్ లుగా చేసి ఇప్పుడు దర్శకులుగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు అదే బాటలో ప్రముఖ కొరియోగ్రాఫర్ లు బృంద కూడామెగాఫోన్‌ పట్టారు. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడుగా సినిమాని ఆమె తెరకెక్కిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్, అతిథిరావు హైదరీలు హీరోయిన్స్ గా రియలన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద జియో స్టూడియో ఈ సినిమాని నిర్మిస్తోంది.

ఈ సినిమాని నిన్న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా లాంచ్ చేశారు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ కి వెళ్లనుందని అంటున్నారు. గోవింద్‌ వసంత సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు.  టైటిల్, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ మరి కొన్ని రోజుల్లో ప్రకటించనుందట సినిమా యూనిట్. అంతే కాదండోయ్ ఈ సినిమా హీరో హీరోయిన్స్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.  

More Related Stories