రాఘవేంద్రరావు కాళ్ళ మీద పడిన పూరీ జగన్నాథ్

పూరీ తీసిన టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఎన్టీఆర్ ఇంటెన్స్ తో చెప్పే ఆ డైలాగ్ " జీవితం ఎవరినీ వదిలి పెట్టదు అనే డైలాగ్ ఒకటి ఉంటుంది. నిన్న పూరీ మాటల్లో అదే అర్ధం కనిపించింది. నిన్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు పూరి జగన్నాథ్ క్షమాపణలు చెప్పారు. అక్కడితో ఆగకుండా క్షమించమని ఆయన కాళ్లకు మీద పడ్డారు. ఈ వ్యవహారం అంతా అనుష్క 15 సంవత్సరాల ఈవెంట్లో చోటు చేసుకుంది.
అనుష్క గురించీ, ఆమె మంచితనం గురించీ రాఘవేంద్రరావు మాట్లాడారు. అది పూర్తయ్యే సమయానికి ఎవరూ పిలవకుండానే స్టేజి పైకి వచ్చిన పూరి జగన్నాథ్, ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని కోరారు. అనంతరం మాట్లాడిన పూరీ అలా ఎందుకు చెబుతున్నానో వివరించాడు. తన మొదటి సినిమా లాంచింగ్ కు రాఘవేంద్రరావు వచ్చారని అప్పుడే ఆయన్ని కలుసుకున్నానని అన్నారు.
ఆ తర్వాత మళ్లీ ఆయన్ని సూపర్ టైంలో అన్నపూర్ణ స్టూడియోలో కసుకున్నట్లు పూరి తెలిపాడు. సర్ ఇక్కడ ఉన్నారేమిటి అని అడిగితే నాగార్జునకి కధ చెప్పేందుకు వచ్చానని అన్నారని అన్నారు. వెంటనే తాను 5వ తరగతిలో ఉన్నప్పుడు మీ అడవిరాముడు సినిమా చూశా నేనే ఇప్పుడు రెక్టర్ అయి సినిమాలు చేస్తున్నా. ఇంకా మీరెందుకు సర్ చేయడం.. రిటైర్ అవమని సలహా ఇచ్చానని దానికి ఆయన నవ్వి ఊరుకున్నాడని పేర్కొన్నాడు.
అయితే ఆయన చేసిన శ్రీరామదాసు బ్లాక్ బస్టర్ అయింది కానీ నేను చేసిన సూపర్ ఆడలేదని అన్నాడు. అప్పుడు నేను వాగిన చెత్త వాగుడుకు ఇప్పుడు రాఘవేంద్ర రావు గారికి క్షమాపణలు చెబుతున్నా అని రాఘవేంద్ర రావు కాళ్ళ మీద పడ్డాడు పూరి. అయితే ఆయన రామాదాసు బదులు అన్నమయ్య పేరు చెప్పాడు.