English   

అల్లు అర్జున్ దర్శకుడితో రవితేజ సినిమా..

Ravi Teja
2020-03-13 15:06:08

ఒక్క ఫ్లాప్ ఇస్తే చాలు.. ఆ ద‌ర్శ‌కున్ని హీరోలు ప‌ట్టించుకోమ‌న్నా కూడా ప‌ట్టించుకోరు. అది ఇండ‌స్ట్రీలో సాధార‌ణంగా క‌నిపించే సీన్. ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడికి కూడా ఇదే జ‌రుగుతుంది. కాక‌పోతే ఇక్క‌డ మ‌రో విచిత్రం కూడా ఉంది. ఆయ‌న ఏ హీరో చుట్టూ అయితే తిరుగుతున్నాడో అత‌డు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. అందుకే తాను దూర సందులేదు.. మెడ‌కేమో డోలా అనే సామెత గుర్తొస్తుందిప్పుడు. ర‌వితేజ‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఈయ‌నే వ‌ర‌స ఫ్లాపుల్లో ఎప్పుడు హిట్ కొడ‌దామా అని చూస్తున్నాడు. మ‌ళ్లీ ఈయ‌న‌కు తోడుగా ఫ్లాప్ ద‌ర్శ‌కులు వ‌చ్చి ర‌వితేజ‌కు క‌థ‌లు చెబుతున్నారు. ఇప్పుడు వ‌క్కంతం వంశీ కూడా వ‌చ్చి ర‌వితేజ పంచ‌న చేరాడు. నా పేరు సూర్య ఇచ్చిన షాక్ కు రెండేళ్లుగా క‌నిపించ‌డం మానేసాడు.

బ‌న్నీకి ఏడేళ్ల త‌ర్వాత వ‌చ్చిన డిజాస్ట‌ర్ ఇది. 80 కోట్ల బిజినెస్ చేసి 50 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది నా పేరు సూర్య‌. ఈ సినిమా త‌ర్వాత పూర్తిగా క‌నిపించ‌డం మానేసాడు వ‌క్కంతం వంశీ. ఆ సినిమా హిట్ అయి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది కానీ ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌ను తాను నిరూపించుకోవాల్సిన ప‌నిలో ప‌డ్డాడు వంశీ. దాంతో ఈయ‌న రెండో సినిమాపై అంద‌రి ఆస‌క్తి ఉంది. నా పేరు సూర్య ఫ‌లితం చూసిన త‌ర్వాత ఏ హీరో అయినా వంశీకి ఆఫ‌ర్ ఇచ్చే దైర్యం చేస్తాడా అనేది అస‌లు అనుమానం. క‌చ్చితంగా ఇప్ప‌ట్లో వ‌క్కంతం మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌డం క‌ష్ట‌మే అనుకుంటున్న తరుణంలో రవితేజ ఆఫర్ ఇచ్చాడు.

ఈయ‌న రెండో సినిమా రవితేజతోనే చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయింది. గతంలో రవితేజ నటించిన కిక్, కిక్ 2, టచ్ చేసి చూడు లాంటి సినిమాలకు కథ అందించాడు వంశీ. ఇప్పుడు దర్శకుడిగా ఆయనతో సినిమా చేయబోతున్నాడు. ఈ మ‌ధ్యే మాస్ రాజాను క‌లిసి వ‌క్కంతం క‌థ చెప్పాడు. ప్ర‌స్తుతం గోపీచంద్ మలినేనితో క్రాక్.. రమేష్ వర్మతో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. అంతా ఫ్లాప్ ద‌ర్శ‌కుల‌తోనే. ఇక ఇప్పుడు మ‌రోసారి ఫ్లాప్ డైరెక్ట‌ర్ నే నమ్ముకుంటున్నాడు.

More Related Stories