English   

ఉగాదికి మహేష్ కొత్త సినిమా లాంచ్ 

Mahesh Babu
2020-03-13 16:13:27

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ తర్వాత సుకుమార్ సినిమా చేయాల్సినా దానిని పక్కన పెట్టి మరీ అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాను లైన్లో పెట్టి హిట్ కొట్టాడు. ఈ తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించాల్సి ఉన్నా ఆ సినిమా కూడా రద్దయిపోయింది. అందుకే ఇప్పుడు పరశురామ్ ప్రాజెక్టు లైన్ లోకి వచ్చింది. ఈ సినిమాని మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మించనుందని ప్రచారం జరుగుతోంది. 

నిజానికి ఇప్పటికే పరశురామ్ చైతూతో ఒక సినిమా ఒప్పుకున్నాడు. దీంతో ఈ రెండు సినిమాలలో ఏదో ఒకదానికి వదులుకోవాలని అనుకుంటున్నట్టు కూడా ప్రచారం జరిగింది.  అయితే అదేమీ లేదని అంటున్నారు. అలాగే మహేష్ బాబు సినిమా అయితే ఈ ఉగాదికి లాంచ్ కూడా చేస్తారని తాజాగా ప్రచారం మొదలయింది. 

ఉగాది రోజున పూజా కార్యక్రమాలను నిర్వహించి ఈ సినిమాని లాంచ్ చేస్తారట. కానీ సినిమా షూటింగ్ ఎప్పుడనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మహేష్ చిరు కొరటాల సినిమా చేస్తున్నాడని కూడా ప్రచారం జరుగుతోన్న నేపధ్యంలో ఈ విషయాల మీద ఏదయినా అధికారిక ప్రకటన వెలువడకుండా అయితే ఏమీ చెప్పలేని పరిస్థితి.
 

More Related Stories