English   

మెగా హీరో డెబ్యూ సినిమాకి ఇన్ని కోట్లా..

Vaishnav Tej
2020-03-13 16:21:17

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ ఉప్పెన అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పని చేసిన శానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే,  వైష్ణవ్ తేజకు అప్పుడే  రెండో  సినిమా ఓకే అయిందని చెబుతున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఇతర ప్రోమోలు కూడా మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సినిమా మంచి క్వాలిటీతో తీసినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమాకి ఇప్పటిదాకా పాతిక కోట్ల దాకా బడ్జెట్ అయినట్లు చెబుతున్నారు. నిజానికి కొత్త హీరో సినిమాకి ఖర్చు పెట్టడానికి నిర్మాతలు ఎప్పుడూ ఉత్సాహం చూపించరు. కానీ ఉప్పెన కోసం ఏకంగా పాతిక కోట్లు ఖర్చు పెట్టారు. సినిమాలో విషయం ఉందని నమ్మి అంత ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు. 

దేవి సంగీతం ఇచ్చిన ఈ సినిమాలో మొదటి రెండు పాటలకి భలే క్రేజ్ వచ్చింది. హీరోయిన్ కూడా చాలా బాగుండడం, ఈ సినిమా కోసం యూత్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఒక కొత్త హీరో సినిమాకి అది కూడా సొంత ప్రొడక్షన్ కాకుండా బయట వాళ్ళు ఇంత డబ్బు పెట్టడం అంటే మామూలు విషయం కాదని అంటున్నారు. చూదాం మరి నిర్మతలు అంత నమ్మకం పెట్టిన సినిమా ఏమాత్రం దూసుకుపోతుందో ?  

More Related Stories