English   

అక్షయ్ కుమార్‌కు కరోనా దెబ్బ.. షాక్‌లో దర్శక నిర్మాతలు.. 

Sooryavanshi
2020-03-13 16:46:33

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ పేరు వింటే వణికిపోతున్నారు ప్రజలు. సినిమా వాళ్లను కూడా బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ఇది. దీని దెబ్బకు అన్ని దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా వైరస్ మాత్రం వీరవిహారం చేస్తుంది. దాంతో దర్శక నిర్మాతలు కూడా ఇఫ్పుడు తమ సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు. భారీ సినిమాలు ఇప్పుడు విడుదలై కరోనాకు బలైపోతే కోట్ల నష్టాలు తప్పదు. అందుకే కొన్ని రోజులు ఆలస్యమైనా పర్లేదు.. కరోనా తగ్గిన తర్వాతే వద్దాంలే అనుకుంటున్నారు. 

ఇఫ్పటికే కొన్ని మెట్రో నగరాల్లో థియేటర్స్ కూడా మూసివేశారు. ఢిల్లీలో అయితే థియేటర్స్ అన్నీ క్లోజ్ చేసారు. ఇక కేరళలో కూడా మార్చ్ 31 వరకు థియేటర్స్ బంద్. మన ఏపీ, తెలంగాణల్లో కూడా నెల్లూరు లాంటి జిల్లాల్లో థియేటర్స్ అన్నీ క్లోజ్ చేసారు. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ తో అక్షయ్ కుమార్ సినిమా వాయిదా పడింది. ఈయన నటించిన సూర్యవంశీ మార్చ్ 24న విడుదల కావాల్సింది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. రోహిత్ శెట్టి దీనికి దర్శకుడు కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కత్రినా కైఫ్ హీరోయిన్.. అజయ్ దేవ్ గన్, రణ్ వీర్ సింగ్ ఇందులో అతిథి పాత్రల్లో కూడా మెరిసారు. 

ఈ సినిమాను మార్చ్ 24న విడుదల చేయాలనుకుంటే ఇప్పుడు కరోనా దెబ్బకు వాయిదా పడినట్టు తెలుస్తుంది. మార్చి 24 నుంచి కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా వాయిదా పడటం మాత్రం నిజంగానే బాలీవుడ్ బాక్సాఫీస్ కు భారీ దెబ్బ. ఈ మధ్యే విడుదలైన టైగర్ ష్రాఫ్ భాగీ 3 సినిమాకు కరోనా కారణంగా తక్కువ వసూళ్లే వచ్చాయి. నిజానికి ఈ సినిమాపై ఉన్న అంచనాలకు సంచలనాలు సృష్టిస్తుందేమో అనుకుంటే తక్కువ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకున్నాడు టైగర్. అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఇప్పుడు తన సినిమాను పూర్తిగా వాయిదా వేసుకుంటున్నాడు అక్షయ్ కుమార్. 

More Related Stories