English   

పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసా...

Pawan Kalyan
2020-03-13 17:04:00

పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటి వరకు భారీ బడ్జెట్ తో వచ్చింది లేదు. ఎందుకంటే ఈయన ఇప్పటి వరకు చేసింది నార్మల్ సినిమాలే. సోషియో ఫాంటసీ లాంటి సబ్జెక్టులు చేయలేదు కాబట్టి బడ్జెట్ ఎప్పుడూ హద్దులు దాటలేదు. అయితే ఇప్పుడు పవన్ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈయన వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. 

ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్సుల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పని చేస్తున్నారు. దానికోసం బరువు తగ్గాలని దర్శకుడు క్రిష్.. పవన్ కళ్యాణ్ కు చెప్పినట్లు తెలుస్తుంది. దాంతో ఈయన కూడా అదే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. రాబిన్ హుడ్ తరహా కథతో స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బందిపోటుగా నటిస్తున్నాడు పవర్ స్టార్.

క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు గెటప్స్ లో కనిపిస్తున్నాడు. అందులో ఒకటి గడ్డంతో ఉన్నది.. మరొకటి క్లీన్ షేవ్ తో కనిపించేది. ఇప్పటికే గడ్డం ఎపిసోడ్స్ షూట్ చేసారు.. మరికొన్ని తర్వాత చిత్రీకరించబోతున్నాడు క్రిష్. ఇప్పుడు తెరకెక్కిస్తున్న ఫైట్ సీక్వెన్స్ కోసం బరువు తగ్గుతున్నాడు పవర్ స్టార్. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కొంచెం బరువు పెరిగాడు. దాంతో పాటు గ్లామర్ కూడా పోయింది. దాంతో ఇప్పుడు మళ్లీ అదే పనిలో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా ఇదే. ఈ సినిమా కోసం ముందు 100 కోట్లు అనుకున్నా కూడా ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే కచ్చితంగా 130 కోట్ల నుంచి 150 కోట్ల వరకు అయ్యేలా కనిపిస్తుంది. అవెంజర్స్ లో ఐరన్ మ్యాన్-థార్ టైప్ ఫైట్స్ లాంటివి ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. 

More Related Stories