English   

ఇటలీ నుంచి యు టర్న్ తీసుకున్న ప్రభాస్..

Prabhas
2020-03-13 17:12:20

మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. ముఖ్యంగా ఇటలీ లాంటి దేశాల్లో అయితే కరోనా మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. డాక్టర్లతో పాటు శాస్త్రవేత్తలను కూడా ఈ వైరస్ గురించి కుచ్ కరోనా అంటూ చాలా మంది అడుగుతున్నా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికీ వేల మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. ఇంకా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దాంతో మన వాళ్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. బయటికి వస్తే కచ్చితంగా మాస్కులు వేసుకుని కానీ రావడం లేదు. 

ఇదిలా ఉంటే మొన్నామధ్య కరోనా ప్రబలంగా వ్యాపిస్తున్న సమయంలో ఇటలీ వెళ్లాడు ప్రభాస్. రాధాకృష్ణ కుమార్ సినిమా కోసం అక్కడికి వెళ్లాడు. ఎయిర్ పోర్ట్ లో మాస్క్ వేసుకుని మరీ కనిపించాడు. అయితే ఇఫ్పుడు అక్కడి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇండియాకు వచ్చేసారు ప్రభాస్ అండ్ టీం. ఇటలీలో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరో రెండు వారాల పాటు ఇంటి నుంచి ఎవరు బయటికి వచ్చినా కూడా భారీ జరిమానాలు వేస్తున్నారు. దాంతో పాటు టూరిస్ట్ వీసాలు.. షూటింగ్స్ అన్నీ క్లోజ్ చేసారు. అందుకే ఇఫ్పుడు ప్రభాస్ టీం కూడా మళ్లీ యు టర్న్ తీసుకున్నారు. 

నిన్నమొన్నటి వరకు ఆర్ఎఫ్సీలో షూట్ జరగడంతో అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు దేశం దాటేయడం.. అక్కడ కరోనా దారుణంగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. ఈ సినిమా కూడా దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సాహో సినిమా నిరాశ పరిచినా కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు ప్రభాస్. దీనికి ఓ డియర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది. ప్రభాస్ సొంత బ్యానర్ గీతాకృష్ణతో పాటు యువీ క్రియేషన్స్ దీన్ని నిర్మిస్తున్నారు. ఏదేమైనా కూడా కరోనా దెబ్బకు అంతా వణికిపోతున్నారిప్పుడు. 

More Related Stories