English   

ఆచార్య యూనిట్ కి షాకిచ్చిన త్రిష..మహేష్ వల్లనేనా

trisha
2020-03-13 19:40:45

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. ఈ సినిమాకి సంభందించిన ప్రతి చిన్న వార్తా ఇండస్ట్రీలో సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. మూవీలో  సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ లో కనిపిస్తుండటంతో సినిమా క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సినిమా నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. అదేంటంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె త్వీట్ ని యధాతధంగా తెలుగులో అనువదించే ప్రయత్నం చేశాం. ‘కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగవు. ముందు చెప్పినదానికి తర్వాత చేయబోయేదానికి వ్యత్యాసాలు ఉంటాయి. చిరంజీవి సర్ సినిమాలో అటువంటి క్రియేటివ్ పరంగా డిఫరెన్సెస్ రావడం వలన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాను. సినిమా టీమ్ కు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మరో మంచి సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తాను’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆచార్య నుంచి త్రిష బయటకు వచ్చేసినట్టు ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ఈ సినిమా స్టోరీని మహేష్ కోసం మార్పులు, చేర్పులు చేశారట. ఆ మార్పులు వలనే త్రిష ఇప్పుడు సినిమాకి గుడ్ బై చెప్పిందని అంటున్నారు. అయితే మరో ప్రచారం కూడా జరుగుతోంది, అదేంటంటే గతంలో తనతో హీరోగా నటించిన మహేష్ కంటే పెద్ద వయసు పాత్ర తాను చేయనని, మహేష్ సినిమాలో ఉంటే తాను నటించనని స్పష్టం చేసిందట. అందుకే ఆమె తప్పుకుంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

 

More Related Stories