English   

సహనటుడికి అండగా సేతుపతి..

vijay
2020-03-13 20:20:28

ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు మక్కల్ విజయ్ సేతుపతి. ఆయన తెలుగులో కూడా కొన్ని డైరెక్ట్ సినిమాలు ఒప్పుకుని షూట్ లో పాల్గొంటున్నాడు. ఆయన జూనియస్ర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరో దాకా ఎదిగాడు. అలా ఎదిగాడు కాబట్టే ఆయనకి కష్టం అంటే ఏంటో తెలుసు. అందుకే ఆయన తన సహనటులకి సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన నటుడు, యాంకర్‌ లోకేశ్‌ కి సహాయం చేశారు. నిజానికి ఈ మధ్యనే లోకేష్ అనారోగ్యానికి గురయ్యాడు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి అందుకోసం ఆయన చికిత్స అందుకుంటున్న సమయంలోనే పక్షవాతం కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం అతని కుటుంబం వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉందన్న విషయం తెలుసుకున్న విజయ్‌ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాడు.

అంతే కాక తాను ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చాడని చెబుతున్నారు. అయితే వీరి మధ్య ఉన్న అనుబంధం అంటే ఏమిటో అనుకునేరు. గతంలో సేతుపతి హీరోగా నయనతార కాంబినేషన్ లో వచ్చిన ‘నేను రౌడీనే’లో లోకేశ్‌ చిన్న పాత్ర పోషించాడు. అయితే తనతో పనిచేసే అందరినీ గుర్తుంచుకునే ఆయన లోకేష్ కి ఇలా జరిగిందని తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించాడట. ఈయన ప్రస్తుతం తెలుగులో ‘ఉప్పెన’తో పాటు అల్లుఅర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో కూడా నెగటివ్ లీడ్ రోల్ చేస్తున్నారు.

More Related Stories