ఎరుపులో అందాల విరుపు చూపిస్తున్న దిశా..

కొందరు హీరోయిన్లు కేవలం అందాలతోనే ఆకట్టుకుంటారు. వాళ్లకు నటన వచ్చినా రాకపోయినా వాళ్లున్నది గ్లామర్ షో కోసమే. దిశా పటానీ కూడా అంతే. లేకపోతే మరేంటి.. ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇప్పుడు అంతకంటే ఇంకేం అంటాం చెప్పండి. సాధారణంగా అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ చేస్తుంటే అందాలు మాత్రమే హైలైట్ అవుతుంటాయి కానీ దిశాపటానీ మాత్రం అందాలతో పాటు ఫిట్ నెస్ కూడా చూపిస్తుంటుంది. ఇప్పుడు కూడా బికినీతో మతులు చెడగొట్టేసింది ఈ భామ. సిక్స్ ప్యాక్ కూడా చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. హీరోలు సిక్స్ ప్యాక్ చేస్తే.. తాను కూడా అదే రేంజ్ లో తమ బాడీ డెవలప్ చేస్తానంటుంది దిశాపటానీ. ఈ లిస్ట్ లో ఎప్పుడూ ముందే ఉంటుంది ఈ భామ. ఈమె అందాల ఆరబోతే కాదు.. దాన్ని కాపాడుకోవడం కూడా పక్కాగా చేస్తుంది. ఎప్పుడూ జిమ్ లోనే కష్టపడుతూ ఉంటుంది. షూటింగ్స్ లేకపోతే అక్కడే చెమటలు ధారపోస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్ నెస్ ను మెరుగుపరుచుకుంటూ తన తోటి ముద్దుగుమ్మలకు పోటీ ఇస్తూ ఉంటుంది. లోఫర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన దిశాపటాని తర్వాత కనుమరుగైపోయింది. దానికి కారణం ఆమె చూపులన్నీ బాలీవుడ్ పై ఉండటమే. అక్కడికి వెళ్లి ఎమ్మెస్ ధోనీ బయోపిక్ లో చిన్న పాత్రలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది గానీ దిశాకు ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు తన ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి ముంబై నగరాన్ని బాగా చుట్టేస్తుంది దిశా. అందులో భాగంగానే బికినీతో పాటు ఇలా అప్పుడప్పుడూ ఫిట్ నెస్ స్ట్రీక్ తో పిచ్చెక్కిస్తుంది ఈ భామ. ఇప్పుడు కూడా ఎరుపు డ్రస్సులో పిచ్చెక్కించింది దిశా. మొత్తానికి అటు అందాల ఆరబోత.. ఇటు సినిమాలతో రప్ఫాడిస్తుంది ఈ బ్యూటీ.