English   

యాంకర్ శ్రీముఖి చేతులారా కెరీర్ నాశనం చేసుకుందా..

sri
2020-03-14 07:51:22

ఏమో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. లేకపోతే మరేంటి.. ఒకప్పుడు ఉన్న శ్రీ‌ముఖి కెరీర్ ఇప్పుడున్న ఆమె కెరీర్ బేరీజు వేసుకుంటే ఇట్టే తేడా తెలిసిపోతుంది. బిగ్ బాస్ కు ముందు వరస అవకాశాలతో దూసుకుపోయిన శ్రీముఖి ఇప్పుడు మాత్రం ఎటూ కాకుండా ఉంది. త‌న యాంక‌రింగ్ తో మ‌తులు పోగొడుతున్న ప‌టాస్ పిల్ల శ్రీ‌ముఖి ఇప్పుడు అందాల‌తో రెచ్చ‌గొడుతుంది. టీవీల్లో రోజూ క‌నిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్ద‌తెర‌పై కూడా మాయ చేయాల‌ని చూస్తుంది. ఇప్ప‌టికే కొన్ని సినిమాల్లో న‌టించినా కూడా శ్రీ‌ముఖికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఈ భామ కూడా అందాల ఆర‌బోత‌కు తెర‌తీసింది. తెలుగ‌మ్మాయి కావ‌డంతో ఆటోమేటిక్ గా మ‌నోళ్లు శ్రీ‌ముఖిని త‌క్కువ‌గా చూస్తున్నారు. తాను యాంక‌రింగ్ చేస్తోన్న ప్రోగ్రామ్స్ లో చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో మెరుస్తూ.. తాను గ్లామ‌ర్ షోకు కూడా రెడీ అని హింట్ ఇస్తోంది. పైగా ఈ మ‌ధ్య ఆడియో ఫంక్ష‌న్స్ లోనూ శ్రీ‌ముఖి కాస్త హ‌ద్దులు దాటేస్తోంది. ఇప్పుడేమో ఏకంగా షార్ట్స్ లో అందాల్ని ఆర‌బోసింది శ్రీ‌ముఖి. కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ ఈ స్థాయిలో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌.

ఆ మధ్య రెడ్ డ్ర‌స్ లో అమ్మ‌డు తొడ‌లు క‌నిపించేలా చేసిన ఎక్స్ పోజింగ్ కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేసింది. ఆ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా న‌టించింది శ్రీ‌ముఖి. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో హై రేంజ్ గ్లామ‌ర్ షో చేసింది. ఇక మొన్న‌టికి మొన్న బిగ్ బాస్ ల చిట్టిపొట్టి నిక్కరులతో పిచ్చెక్కించింది. ఇప్పుడు ఏకంగా క్లీవేజ్ షో చేస్తూ మతులు చెడగొట్టేసింది. అయితే ఎంత చేసినా కూడా ఈమె కోరుకున్న గుర్తింపు మాత్రం రావడం లేదు. అవకాశాలు కూడా అరకొరగానే వస్తున్నాయి. దాంతో బిగ్ బాస్ వెళ్లి అనవసరంగా కెరీర్ పాడు చేసుకుందేమో అనే అనుమానాలు కూడా బలంగానే వస్తున్నాయి. అదే బయట వినిపిస్తున్నాయి కూడా. మరి దీనికి అమ్మాయిగారు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలిక.

More Related Stories