పూరీని మార్చేసిన విజయ్ సినిమా

ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా కొత్త సినిమా చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. ముందే అనుకున్నారో లేదో కానీ ప్రస్తుతానికి అయితే ఇది ఒక మల్టీ లాంగ్వేజ్ అదే నండీ ప్యాన్ ఇన్దిఆ సినిమా. తెలుగు, తమిళ, హిందీ బాషలలో ఈ సినిమాని తెరకేక్కిస్తున్నారు పూరీ. ముందు పూరీ సొంత ప్రొడక్షన్ అన్నారు కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి కరణ్ జోహార్ సహ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.
తన కెరీర్ లో మొదట సరిగా పూరీ మూడు భాషల్లో తెరకెక్కిస్తుండటంతో దీని మీద అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే అయన పంధాని మార్చేస్తూ ఈ సినిమా పూరీని చాలా ఇబ్బంది పెడుతోందట. ఎందుకంటే ఈ సినిమాకి ముందు అనుకున్న టైటిల్ ఒక ప్రాబ్లమ్ అయితే హీరోయిన్ ఎంపిక విషయం మరో ప్రాబ్లం వీటి వలనే దాదాపు నెలరోజులు వేస్ట్ అయ్యిందట. ముందుగా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ను హీరోయిన్ అనుకున్నా, జాన్వీ డేట్లు కుదరక చివరకు అనన్యా పాండే అనే ఆమెను విజయ్‌కు జోడీగా ఫైనల్ చేశారు.
నిజానికి పూరీ ఏ ప్రాజెక్టు చేప్టటినా చాలా వేగంగా పూర్తి చేస్తారనే టాక్ ఉంది. క్లాప్ కొడితే రెండు నెలల్లో బొమ్మ రిలీజ్ అయిపోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ విజయ్ దేవరకొండ హీరోగా ఈ ప్రాజెక్టు మొదలుపెట్టే రెండు నెలలు దాటిపోయింది. ఇప్పటికీ టైటిల్ ఏంటో తెలియదు, ఇంకా రిలీజ్ ఎప్పుడో ఇంకేం చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు కొందరు. పూరీ తన కెరీర్ లో మొట్టమొదటి సారిగా తన మార్క్ పనితనానికి భిన్నంగా వెళ్తున్నాడని, ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత ఇబ్బంది పడుతున్నాడనే కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఏం చేద్దాం కాలం ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా ఎక్కడ మారుస్తుందో తెలీదు కదా.