కుర్ర దర్శకుడితో వెంకటేష్.. ఏం చేస్తాడో మరి..

వెంకటేష్ ఈ మధ్య వరసగా కుర్ర దర్శకులతోనే పని చేస్తున్నాడు. బాబీతో ఈ మధ్యే వెంకీ మామ సినిమా చేసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం అసురన్ రీమేక్ బాధ్యతలు కూడా శ్రీకాంత్ అడ్డాలకు ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాకు కూడా ఈయన కమిటయ్యాడు. పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈయన ఓ సినిమా చేస్తున్నాడు. చాలా ఏళ్లుగా ఈ సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నా కూడా కుదర్లేదు.
అయితే ఇప్పుడు వెంకటేష్‌తో సినిమా ఉంటుందని తరుణ్ భాస్కర్ కన్ఫర్మ్ చేసాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని చెప్పాడు ఈయన. ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత ఈయన దర్శకుడిగా కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇక గతేడాది విజయ్ దేవరకొండ నిర్మాతగా మారిన చేసిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో హీరోగా నటించాడు. దాంతో పాటే నెట్ ప్లిక్స్ కోసం వెబ్ సిరీస్ చేసాడు తరుణ్.
లస్ట్ స్టోరీస్ తెలుగు వర్షన్స్‌లో ఒకటి ఈయన తెరకెక్కించాడు. ఇందులో మంచు లక్ష్మి ముఖ్య పాత్రలో నటించింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ వస్తుంది. ఈటీవీ ప్లస్‌లో 'నీకు మాత్రమే చెప్తా' పేరుతో ఓ షో నిర్వహిస్తున్నాడు తరుణ్ భాస్కర్. మార్చ్ 14 నుంచి ఇది ప్రసారం కానుంది. తొలి ఎపిసోడ్ అనిల్ రావిపూడితో షూట్ చేసారు. ఇందులో దర్శకులను ఇంటర్య్వూ చేయనున్నాడు తరుణ్ భాస్కర్. ఇన్ని చేస్తూనే మరోవైపు వెంకటేష్ సినిమాను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు ఈయన.